Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'క్రికెటర్లు హీరోయిన్లతో అలా చేస్తే.. తప్పేంటి భయ్యా?'

పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌కు ఓ లేడీ ఫ్యాన్ నుంచి అనుకోని ప్రశ్న ఎదురైంది. 'చాలా మంది పాక్‌ క్రికెటర్లంతా తమకు సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతుంటారని ఫీమేల్ యాక్ట్రెస్ అంటుంటారు. అందులో మీరు కూడా ఉన్నారా?' అని అడిగింది. దానికి షాదాబ్‌ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

గతేడాది టిక్‌టాకర్‌ షాతాజ్‌ ఖాన్‌.. షాదాబ్‌ ఖాన్‌ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు తనతో వాట్సాప్‌ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేశాడని పేర్కొంది. అలానే తనను పెళ్లి చేసుకుంటాడని అతడు చెప్పినట్లు వెల్లడించింది. అయితే అప్పటికే షాదాబ్ కు సీనియర్ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ కూతురు మలైకాతో పెళ్లై రెండేళ్లు అయింది. కానీ ఈ విషయం తనకు తెలీదని షాతాజ్ చెప్పింది. మరో నటి నవాల్ సయీద్ కూడా కొంతమంది పాకిస్థాన్ క్రికెటర్లు తనకు మెసేజ్ లు చేశారని పేర్కొంది. దీంతో పాక్ క్రికెటర్లు.. నటీమణీలకు మెసేజ్ లు పంపుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే తాజాగా ఓ మహిళా అభిమాని షాదాబ్ ఖాన్.. 'మీరు కూడా నటీమణీలకు సందేశాలు పంపుతున్నారా' అంటూ ప్రశ్న వేసింది.

Pakisthan Cricketer Shadab Khan Breaks Silence on Pakistan Cricketers Texting Female Actors

దానికి షాదాబ్ ఖాన్ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. 'ఒకవేళ క్రికెటర్లు వాళ్లకు సందేశాలు పంపితే, అందులో తప్పేముంది. అయినా వాళ్లకు ఇష్టం లేకపోతే రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేస్తే సరిపోతుంది. అయినా వాళ్లు ఎందుకు సమాధానాలు ఇస్తున్నారు. తమకు కూడా ఎదుటి వారిపై ఆకర్షణ ఉంది కాబట్టే రిప్లైలు ఇస్తున్నారు. సరైన సమయం చేసుకుని ఫేమ్ కోసం ఇలాంటివి బయటపెడుతుంటారు.' అంటూ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షాదాబ్‌ ఖాన్‌... స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ గా కెరీర్ లో రాణించాడు. ఆరు టెస్టులు ( 300 పరుగులు, 14 వికెట్లు), 70 వన్డేలు (855, 85), 104 టీ20లు (679, 107) ఆడాడు.

Story first published: Wednesday, January 29, 2025, 18:12 [IST]
Other articles published on Jan 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+