ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ - పాక్ రసవత్తర పోరు వచ్చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కోచ్ అకీబ్ జావెద్ వార్నింగ్ భారత జట్టుకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. అలానే భారత్ పాక్ మ్యాచ్ అంటే అంతకుమించి అని పేర్కొన్నాడు.
మేమెంటో చూపిస్తాం!..
"ఒత్తిడి లేకుండా ఏ గేమ్ ఉండదు. కాబట్టి ఒత్తిడి అనేదే లేకుండా మీరు ఆడలేరు. మొదటి గేమ్ లో ఓడిపోయాం. ఓకే. న్యూజిలాండ్ బలమైన జట్టు. వాళ్లకి మంచి బ్యాలెన్స్ ఉంది. తొలి మ్యాచ్ లో ఓడిపోతేనేం.. రెండు, మూడు మ్యాచుల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే సెమీస్ కు తీసుకెళ్తుంది. నాకౌట్ లేదా ఇంకేమైనా అది పెద్ద మ్యాటర్ కాదు. అక్కడ ఉంది భారత్ - పాక్ మ్యాచ్. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అది అంతకుమించి. రెండిటి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాకు తెలిసి వ్యక్తిగతంగా లేదా జట్టగా తామేంటో నిరూపించుకోవాడనికి ఇది బెస్ట్ టైమ్, బెస్ట్ ఛాన్స్. చూడండి మేం ఈ సారి టీమిండియాకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం." అని చెప్పుకొచ్చాడు.

అలాంటి పప్పులేం ఉడకవు..
దుబాయ్ పిచ్ పై ఇప్పటికే టీమిండియా ఓ మ్యాచ్ (బంగ్లాదేశ్ పై) ఆడింది. కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కు ఇదే తొలి మ్యాచ్. దీంతో దుబాయ్ పిచ్ భారత జట్టుకు కాస్త కలిసొచ్చే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పిచ్ గురించి అకీబ్ జావెద్ మాట్లాడుతూ.. "భారత్ కు ఈ పిచ్ ల వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకంటే పాకిస్థాన్ ప్లేయర్లు చాలా కాలం నుంచి లీగ్ మ్యాచులు ఈ పిచ్ లపైనే ఆడుతున్నారు. కాబట్టి దీని వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ లేడా డిస్ అడ్వాంటేజ్ వంటివి ఉండదు. అయినా మేం పరిస్థితులు, పిచ్ లు, ప్రత్యర్థి జట్టు తగ్గట్టుగా మా వ్యూహాలతో ఆడతాం." అని వెల్లడించాడు.
ఆడితే చప్పట్లు-లేదంటే తిట్లు..
ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్. దాదాపుగా క్రికెట్ అభిమానులంతా భారత జట్టుకే మద్దతుగా ఉన్నారని వార్తలు కనిపిస్తుయి. దీనిపై జావెద్ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు ఏం చేస్తారు. మీరు బాగా ఆడితే మద్దతుగా నిలుస్తారు. చప్పట్లు కొడతారు. అదే పేలవంగా ఆడితే సొంత వాళ్లైనా సరే మీకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. కాబట్టి ఓ ప్లేయర్ గా ప్రేక్షకులను, మద్దుతుగా నిలిచేవారిని దృష్టిలో పెట్టుకుని ఆటకూడదు. బ్యాట్, బంతిపైన మాత్రమే మీ దృష్టి ఉండాలి." అని పేర్కొన్నారు.