Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS PAK New Coach: టీమిండియా జర జాగ్రత్త.. పాకిస్థాన్‌కు స్పెషల్ కోచ్

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాక్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీ టైటిల్ పై పాకిస్థాన్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. టీమిండియాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పుడు ప్రత్యేక ప్లాన్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇందుకోసం దాయాది జట్టు ఓ స్పెషల్ కోచ్ ను నియమించుకుంది. నాజర్ ను ప్రత్యేక కోచ్ గా నియమించింది.

దుబాయ్ పిచ్ లపై అవగాహన..
కోచ్‌గా నాజర్‌కు దుబాయ్ పిచ్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. అతడు గతంలో పాకిస్థాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్ గానూ వ్యవహరించాడు. దుబాయ్ లోని ఐసీసీ గ్లోబల్ అకాడమీలోనూ పని చేసిన అనుభవం ఉంది. అందుకే ఇప్పుడు దుబాయ్ పిచ్ పై టీమిండియాతో జరిగే మ్యాచ్ కోసం అతడిని కోచ్ గా ఎంచుకుంది. కనీసం ఈ కొత్త కోచ్ నియామకంతోనైనా విజయవకాశాలను అందుకోవాలని పీసీబీ భావిస్తోంది.

Pakisthan appoints special coach Mudassar Nazar for ind vs pak Champions trophy 2025
Story first published: Saturday, February 22, 2025, 18:27 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+