Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ చెత్త నిర్ణయం.. ఆడే ఆ ఒక్కడిని తప్పించారు!

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ రేపు సిడ్నీ వేదికగా చివరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో, మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే చివరి టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాల్సిన పాకిస్థాన్ సిడ్నీ టెస్టు ముంగిట చెత్త నిర్ణయం తీసుకుంది.

ఆ జట్టు స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదికి విశాంత్రిని ఇస్తూ తుది జట్టును ప్రకటించింది. అఫ్రిదితో పాటు ఇమానుల్ హక్‌ను కూడా తొలగించింది. వారిద్దరి స్థానాల్లో సయిమ్ అయుబ్, సాజిద్ ఖాన్‌లను సెలక్ట్ చేసింది. 21 ఏళ్ల అయుబ్ గత మార్చిలో టీ20 మ్యాచ్‌తో పాక్ తరపున అరంగేట్రం చేశాడు. మరోవైపు సాజిద్ రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వస్తున్నాడు. అతడు ఏడు టెస్టుల్లో 22 వికెట్లు తీశాడు.

Pakistans worst decision. The one who played well Shaheen Afridi was left out

అయితే షాహిన్ అఫ్రిదికి విశ్రాంతినివ్వడంపై మిశ్రమ స్పందన వస్తుంది. గత 28 ఏళ్ల నుంచి ఆస్ట్రేలియాలో విజయం సాధించాలని చేస్తున్న పోరాటాన్ని పాకిస్థాన్ విరమించుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే సత్తాచాటే ఏకైక బౌలర్‌ను తప్పించారని అంటున్నారు. ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ చివరిసారిగా 1995లో టెస్టు మ్యాచ్ గెలిచింది. ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా కంగారూల గడ్డపై అందుకోలేకపోయింది. ఇక 1999 నుంచి వరుసగా 16 టెస్టుల్లో పాక్ ఓటమిపాలైంది. కనీసం 'డ్రా' కూడా మ్యాచ్ ను ముగించలేకపోయింది.

మరోవైపు షాహిన్ అఫ్రిదితో గత రెండు టెస్టుల్లో దాదాపు 100 బౌలర్ల పాటు బౌలింగ్ చేయించారు. తమకు ఉన్న మ్యాచ్ హీరోపై దారుణంగా పనిభారాన్ని పెంచారు. మూడో టెస్టును దృష్టిలో ఉంచుకొని కూడా ఇతర బౌలర్లతో మెల్‌బోర్న్ టెస్టులో ఎక్కువగా బౌలింగ్ చేయించలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్-పాక్ టెస్టు సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేసింది షాహిన్ అఫ్రిదినే. అత్యధికంగా బౌలింగ్ చేసిన రెండో బౌలర్ నాథన్ లయాన్ (70 ఓవర్లు). వీరిద్దరి మధ్య ఉన్న 30 ఓవర్ల గ్యాప్‌ను చూస్తేనే.. షాహిన్‌పై ఉన్న పనిభారం గురించి ఈజీగా క్లారిటీ వస్తుంది.

మూడో టెస్టుకు పాకిస్థాన్ తుదిజట్టు: సయిమ్ అయుబ్, అబ్దుల్లా షఫీకి, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ, సాజిద్ ఖాన్, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్

ఆస్ట్రేలియా తుదిజట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్) డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషనే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, జోష్ హేజిల్‌వుడ్

Story first published: Tuesday, January 2, 2024, 13:39 [IST]
Other articles published on Jan 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+