PAK vs OMN: ఒమన్‌పై పాకిస్తాన్ గెలుపు.. అసలు మ్యాచ్‌కు ముందే పరువు పోయింది!
PAK vs OMN: ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్ పై పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఒమన్ జట్టు 67 పరుగులకే ఆలౌట్ అయి, 93 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్లు రాణించినా, బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అయితే భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనతలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్తాన్ బ్యాటర్ల వైఫల్యం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఓపెనింగ్ దారుణంగా మొదలైంది. మొదటి ఓవర్లోనే ఓపెనర్ సైమ్ ఆయుబ్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ హారిస్ (66), సాహిబ్జాదా ఫర్హాన్ (29)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

హారిస్ 43 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. కానీ ఫర్హాన్ 29 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. హారిస్ ఔటైన తర్వాత, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా(0), హసన్ నవాజ్ (9) తక్కువ పరుగులకే ఔటయ్యారు. వికెట్లు పడుతుండటంతో రన్ రేట్ తగ్గింది. చివర్లో ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 23), మహ్మద్ నవాజ్ (10 బంతుల్లో 19) వేగంగా పరుగులు చేసి స్కోరును 160కి చేర్చారు.
ఒమన్ బౌలర్ల ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆమిర్ కలీమ్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షా ఫైసల్ కూడా 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా భారీ స్కోరు సాధించాలని ఆశించినా, ఒమన్ బౌలర్లు దాన్ని అడ్డుకున్నారు. చివరగా, పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ, కెప్టెన్, ఓపెనర్ బ్యాటింగ్‌లో విఫలమవడం, జట్టు మధ్య ఓవర్లలో తడబడటం వంటి లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాలను సరిదిద్దుకుని భారత్‌తో జరిగే మ్యాచ్‌కు ఎలా సిద్ధమవుతుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications