Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs BAN: పాక్ పరువుపాయె.. క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు!

పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో బంగ్లా క్లీన్‌స్వీప్ చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టులో బంగ్లా పది వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో పా‌క్‌పై బంగ్లాకు ఇదే తొలి సిరీస్ విజయం.

అయితే సొంతగడ్డపై ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్ తమ పేరిట కోరుకోని రికార్డులు నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో.. సొంతగడ్డపై ఐసీసీ పాత పది పూర్తి సభ్య దేశాల చేతిలో ఓడిన రెండో జట్టుగా చరిత్రకెక్కింది. అంటే.. స్వదేశంలో ప్రధానమైన అన్ని దేశాల చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది.

Pakistan s Unwanted Record Home Test Series Losses to All Ten Oldest Full Member Teams

1998/99లో సొంతగడ్డపై పాకిస్థాన్ జింబాబ్వే చేతిలో కూడా ఉంది. కాగా, ఈ చెత్త రికార్డు పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్‌ పేరిట కూడా ఉంది. ఇక స్వదేశంలో విజయం లేకుండా పాక్‌కు ఇది పదో టెస్టు. ఈ శతాబ్దంలో ఇలా ఇన్ని టెస్టుల్లో విజయం సాధించని మూడో జట్టు పాకిస్థాన్. ఈ జాబితాలో జింబాబ్వే, బంగ్లాదేశ్ సరసన పాక్ చేరింది.

మరోవైపు బంగ్లాదేశ్ అరుదైన ఘనతలు సాధించింది. పాకిస్థాన్‌లో టెస్టుల్లో అత్యధిక ఛేదన చేసిన విజయం సాధించిన మూడో జట్టుగా నిలిచింది. 185 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో శ్రీలంక (220), ఇంగ్లండ్ (208), బంగ్లాదేశ్ (185), ఇంగ్లండ్ (176) టాప్-4లో ఉన్నాయి.

టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు కూడా ఇదే మూడో అత్యధిక విజయవంతమైన ఛేదన. తొలి రెండు స్థానాల్లో 215 (వెస్టిండీస్‌పై), 191 (శ్రీలంకపై) ఉన్నాయి. ఇక విదేశాల్లో బంగ్లాదేశ్‌‌కు ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. అంతకుముందు 2009లో వెస్టిండీస్‌పై 2-0తో, జింబాబ్వేపై 1-0తో టెస్టు సిరీస్‌లను గెలిచింది. ఓవరాల్‌‌గా ప్రత్యర్థి గడ్డపై బంగ్లాకు ఇది ఎనిమిదో టెస్టు మ్యాచ్ విజయం. వెస్టిండీస్‌, జింబాబ్వే, పాకిస్థాన్‌పై రెండు, శ్రీలంక, న్యూజిలాండ్‌పై ఓ టెస్టు నెగ్గింది.

కాగా, ఓవర్‌నైట్ స్కోరు 42/0తో అయిదో రోజు 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్, 51 బంతుల్లో, 1 ఫోర్), షకిబ్ అల్ హసన్ (21 నాటౌట్, 43 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 274, బంగ్లాదేశ్ 262 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 172 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Tuesday, September 3, 2024, 16:15 [IST]
Other articles published on Sep 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+