Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు.. ఒక్కో పరుగుకు రూ.3లక్షలు.. ఎవరో తెలుసా?

Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాకిస్థాన్ కు చెందిన ఇమామ్-ఉల్-హక్ నిలిచాడు. ఇమామ్ ఒక్కో పరుగుకు రూ.3 లక్షలు సంపాదించాడు. ఇమామ్-ఉల్-హక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం లాంటి పెద్ద ప్లేయర్ కూడా కాదు. గాయపడిన ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇమామ్-ఉల్-హక్ భారత్ పై కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనికి రూ.30 లక్షలు ఇచ్చింది. ఈ విధంగా ఇమామ్-ఉల్-హక్ ఒక్కో పరుగులు రూ.3 లక్షలు సంపాదించినట్లు అయింది.

10 పరుగులు మాత్రమే చేసిన ఇమామ్..
మీడియా నివేదికల ప్రకారం.. ఇమామ్-ఉల్-హక్ సాధించిన రన్స్ ఆధారంగా అత్యంత ఖరీదైన ఆటగాడిగా పరిగణించబడ్డాడు. గాయపడిన ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ను భారత జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ కు జట్టులో చేర్చారు. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇమామ్ కు రూ.30 లక్షలు చెల్లించింది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్ చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. ఈ విధంగా ఇమామ్ టోర్నమెంట్ లో ఒక్కో రన్ కు రూ.3 లక్షలు సంపాదించాడు.

Pakistan s Most Expensive Player in Champions Trophy 2025 Imam-ul-Haq Earns 3 Lakhs Per Run

ఇప్పటివరకు 61 పరుగులు చేసిన రోహిత్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు పరుగుకు దాదాపు రూ.19,672 సంపాదించాడు. రోహిత్ 2 మ్యాచ్ లకు గానూ రూ. 12లక్షలు(ఒక మ్యాచ్ కు రూ.6లక్షలు) పొందుతాడు. ఈ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 61 పరుగులు చేశాడు. దాని ప్రకారం ఒక్కో పరుగుకు రూ.19 వేలకు పైగా పొందుతాడు. ఇదిలా ఉండగా.. తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడానికి భారత కెప్టెన్ న్యూజిలాండ్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఆడకపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం(మార్చి 2) రోజున దుబాయ్ లో జరగనుంది. న్యూజిలాండ్, భారత్ లు ఇప్పటికే సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి.

122 పరుగులు చేసి కోహ్లీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కో పరుగుకు దాదాపు రూ.9,806 పొందుతాడు. కోహ్లీ 2 మ్యాచ్ లలో 122 పరుగులు చేశాడు. కోహహ్లీకి రూ.12 లక్షల వేతనం లభిస్తుంది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో ఒకరు. బాబర్ ఆజం రూ.45 లక్షల జీతం సంపాదిస్తున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ ఒక్కో పరుగుకు దాదాపు లక్ష రూపాయలు పొందుతాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ తన రెండు మ్యాచ్ లలో 87 పరుగులు చేశాడు. బాబర్ కు పీసీబీ రూ.90 లక్షలు చెల్లించింది.

Story first published: Friday, February 28, 2025, 11:58 [IST]
Other articles published on Feb 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+