Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ పరువు పాయె..మిలిటరీ ట్రైనింగ్ వృథా!

వన్డే వరల్డ్ కప్‌లో తమ జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించడాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఓటమికి బాధ్యత వహించాలని కెప్టెన్ బాబర్ అజామ్‌పై వేటు వేసింది. మూడు ఫార్మాట్లకు వేరువేరు సారథులను ప్రకటించింది. కానీ మళ్లీ మనసు మార్చుకుంది. టీ20 వరల్డ్ కప్‌కు కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి బాబర్ అజామ్‌కు అప్పగించింది.

టీ20 ప్రపంచకప్ తప్పక విజయం సాధించాలని రిటైర్మెంట్ ప్లేయర్లను కూడా తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. ఇక ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొనే తమ చెత్త ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోవాలని పాక్ ఆటగాళ్లకు ఆర్మీ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంటే మైదానంలో చురుకుగా కదులుతారనే ఉద్దేశంతో ఆర్మీ తరహాలో కఠోర సాధన చేయించింది.

Pakistan s Lost Honor vs New Zealand Criticism Mounts Over Misuse of Military Training

ఇక టీ20 వరల్డ్ కప్‌ ముందు న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో జట్టు కూర్పు సిద్ధం చేసుకోవాలని, స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పాకిస్థాన్ జట్టు భావించింది. అయితే ఐపీఎల్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు పాల్గొనడంతో పాక్‌కు సీ-జట్టును కివీస్ బోర్డు పంపించింది. దీంతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం మరింత ఈజీని పాక్ జట్టు భావించింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అయిదు టీ20ల సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉంది.

ద్వితీయ శ్రేణీ ఆటగాళ్ల చేతిలో స్టార్ ప్లేయర్లు ఉన్న పాకిస్థాన్ ఘోర పరాజయాల్ని చవిచూస్తూ పరువు పోగొట్టుకుంటుంది. అంతేగాక స్వదేశంలో మ్యాచ్‌లను ఓడిపోవడం కొసమెరుపు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. రెండో టీ20లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి సీరిస్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది. కానీ మూడు, నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు, నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావించిన పాకిస్థాన్ ఇప్పుడు సిరీస్ డ్రా అయితే చాలనే పరిస్థితికి వచ్చింది. ఆఖరి టీ20లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. అయిదు టీ20ల సిరీస్‌లో శనివారం చివరి మ్యాచ్ జరగనుంది.

Story first published: Friday, April 26, 2024, 11:20 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+