For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ అసలు హీరో అతనే.. డకౌట్లతోనే రికార్డులు బ్రేక్!

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్ జట్టు యూఏఈపై 41 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-4కు చేరుకుంది. అయితే ఈ విజయం పాకిస్థాన్ జట్టుకు ఎన్నో ప్రశ్నలను మిగిల్చిందని చెప్పవచ్చు. యూఏఈ వంటి బలహీనమైన జట్టుపై కూడా విజయం సాధించడానికి పాకిస్థాన్ జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సైమ్ ఆయుబ్ రెండు అత్యంత చెత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

సైమ్ ఆయుబ్ పేరిట చెత్త రికార్డులు
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సైమ్ ఆయుబ్ మరోసారి తన చెత్త ఫామ్‌ను కొనసాగిస్తూ డకౌట్ అయ్యాడు. ఈ డకౌట్‌తో సైమ్ ఆయుబ్ రెండు చెత్త రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు.

Pakistan s Hero But Saim Ayub Breaks Records for the Wrong Reasons in Asia Cup 2025

టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఓపెనర్‌గా అత్యధిక వరుస డకౌట్లు

3 - ఆండ్రీ ఫ్లెచర్ (2009)

3 - మహ్మద్ హఫీజ్ (2012)

3 - సైమ్ ఆయుబ్ (2025)*

టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక డకౌట్లు:

10 - ఉమర్ అక్మల్ (79 ఇన్నింగ్స్‌లు)

8 - షాహిద్ అఫ్రిది (90 ఇన్నింగ్స్‌లు)

8 - సైమ్ ఆయుబ్ (44 ఇన్నింగ్స్‌లు)*

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ ఆయుబ్ తర్వాత, సాహిబ్జాదా ఫర్హాన్ కూడా కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. 9 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో పాకిస్థాన్ కష్టాల్లో చిక్కుకుంది. ఆ తర్వాత ఫఖర్ జమాన్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. చివర్లో షాహీన్ అఫ్రిది 14 బంతుల్లో అజేయంగా 29 పరుగులు చేయడంతో పాకిస్థాన్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఒకవేళ షాహీన్ అఫ్రిద్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే.. పాకిస్థాన్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినప్పటికీ.. వారి బ్యాటింగ్ లైనప్ బలహీనత మరోసారి స్పష్టమైంది.

పాకిస్థాన్ బ్యాటింగ్‌లో సమస్యలు
యూఏఈ లాంటి బలహీనమైన జట్టుపై గెలవడానికి కూడా పాకిస్థాన్ జట్టు చాలా కష్టపడింది. ముఖ్యంగా పాక్ బ్యాటింగ్ లైనప్ ఇంకా సందిగ్ధంగానే ఉంది. భారత జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లోనూ .. ఆ తర్వాత యూఏఈతో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోయారు. ముఖ్యంగా ఓపెనర్లు విఫలం కావడం పాక్ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ బ్యాటింగ్ బలహీనతలను త్వరగా సరిదిద్దుకోకపోతే.. సూపర్-4లో భారత్ తో జరగబోయే మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకు గెలుపుకు కష్టం కావచ్చు.

Story first published: Thursday, September 18, 2025, 13:01 [IST]
Other articles published on Sep 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+