Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: పాక్‌లో ఉండే ఆ చెత్త అలవాటు ‘భారత్‌’లోనూ ఉంది - గంభీర్

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ కెప్టెన్సీకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసిన నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ బ్యాట్స్‌మన్‌గా జట్టుతో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో కూడా ఓటమిపాలైంది.

అయితే బాబర్ అజామ్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్స్‌మన్‌గా బాబర్ ఎప్పుడూ గొప్ప ప్లేయరే అని, కానీ కెప్టెన్సీలో అంచనాలను అందుకోలేకపోయాడని అన్నాడు. బాబర్ కెరీర్ ముగిసేలోపు పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలుస్తాడని గంభీర్ పేర్కొన్నాడు.

Pakistans habit of praising the captain is also present in India- Gautam Gambhir

''కెప్టెన్సీని స్వీకరించాలా వదిలిపెట్టాలా అనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. నా దృష్టిలో బాబర్ ఇప్పటికీ టాప్ క్వాలిటీ బ్యాటరే. ఇప్పుడు బాబర్ అజామ్ నుంచి అత్యుత్తమ ఆటను మనం చూసే అవకాశం ఉంది. అయితే పాకిస్థాన్‌లో ప్రశంసలు అయినా, నిందలు అయినా అన్నీ కెప్టెన్‌కే చెల్లుతాయి. భారత్‌లో కూడా కొంచెం ఇలాంటి పరిస్థితే ఉంది. కానీ పాకిస్థాన్‌లో ఉన్నంత అతిగా లేదు''

''బాబర్ అజామ్ బ్యాటింగ్ గురించి ఎప్పుడూ సందేహాలు లేవు. కెప్టెన్సీలో మాత్రం ఉండేది. ఇప్పుడు ఆ కెప్టెన్సీని వదిలేశాడు. ఇక నుంచి అతడిలో మరో కొత్తస్థాయి బ్యాటర్‌ను చూడొచ్చు. ప్రస్తుతం పాకిస్థాన్ బ్యాటర్లలో అతడో టాప్ ప్లేయర్. కానీ అతడి కెరీర్ ముగిసేలోపు పాకిస్థాన్ క్రికెట్ లోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలుస్తాడు. అతడు మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడగలడు. అతడేం సాధించగలడో అతడికి తెలియకపోవచ్చు'' అని గంభీర్ తెలిపాడు.

ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదటి టెస్టు ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ అయిదు వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. వార్నర్ 164 పరుగులు సాధించాడు.

Story first published: Thursday, December 14, 2023, 16:22 [IST]
Other articles published on Dec 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+