For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20WC: భారత్ సెమీస్‌‌కు వెళ్లొద్దని పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్! (Video)

మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 54 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 110 పరుగులు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (28; 29 బంతుల్లో, 3 ఫోర్లు), బ్రూక్ హాలిడే (22; 24 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్లు. పాక్ బౌలర్లలో నష్రా సంధు మూడు వికెట్లు. ఒమైమా సోహైల్, నిదా దర్, సదియా ఇక్బాల్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా (21; 23 బంతుల్లో, 2 ఫోర్లు), వికెట్ కీపర్ మునీబా అలీ (15; 11 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కేర్ మూడు వికెట్లు, ఎడెన్ కార్సెన్ రెండు వికెట్లు పడగొట్టారు.

Pakistan s Fielding Woes Eight Drops Costly in T20 World Cup Clash Against New Zealand

ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. పాకిస్థాన్‌తో పాటు భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కివీస్‌పై పాక్ విజయం సాధిస్తే టీమిండియా సెమీస్‌కు చేరేది. కానీ పాకిస్థాన్ పోరాట పటిమ చూపించలేకపోయింది. పేలవమైన ఆట తీరులో రికార్డు ఓటమి చవిచూసింది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు (56) ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా అత్యల్ప స్కోరు చేసిన రెండో జట్టుగా పాక్ నిలిచింది.

అయితే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల తీరు చూస్తే భారత్‌ సెమీస్‌కు చేరకూడదనే రీతిలో ఆడుతున్నట్లుగా కనిపించింది. ఏకంగా పాకిస్థాన్ ఎనిమిది క్యాచ్‌లను జారవిడించింది. ఇందులో ఒక్కటి కూడా కష్టతరమైన క్యాచ్ కాదు. అన్ని సులువైన క్యాచ్‌లే, నేరుగా చేతుల్లోకి వచ్చినా అందుకోలేదు. ఇక ఛేదనలో వాళ్ల బ్యాటింగ్ అతిదారుణంగా ఉంది. 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇక నాలుగు పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని నెట్టింట్లో ఆరోపణలు వస్తున్నాయి.

Story first published: Tuesday, October 15, 2024, 9:41 [IST]
Other articles published on Oct 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+