Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs PAK: పాకిస్థాన్ మరోసారి చెత్త ప్రదర్శన.. 4-1 తేడాతో కివీస్‌దే సిరీస్

NZ vs PAK: పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టు చెత్త ప్రదర్శనలను కొనసాగిస్తోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. ఐదు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా మ్యాచ్‌లలో గల్లీ జట్ల కంటే ఘోరంగా ఆడిన పాకిస్థాన్ జట్టు మరోసారి తమ చెత్త ప్రదర్శనలను రిపీట్ చేసింది. ఈ సిరీస్ లోని ఐదో మ్యాచ్ నేడు వెల్లింగ్‌టన్ లోని స్కై స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి గొప్ప విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పాకిస్థాన్ ను ఓడించి సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది. న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదు కీలక మార్పులు చేసింది. దీని తర్వాత కూడా పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

128 పరుగులు చేసిన పాకిస్థాన్
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టుకు మ్యాచ్ ప్రారంభం ముందే మంచి ఆరంభం లభించలేదు. ఎందుకంటే ఓపెనర్ హసన్ నవాజ్ 3 బంతుల్లో డకౌట్ గా వెనుదిరగగా.. మహ్మద్ హారిస్ 17 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. దీని తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఉమెర్ యూసుఫ్ కూడా నిరాశపరిచాడు. అతను 7 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా 39 బంతుల్లో పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా షాదాబా ఖాన్ 20 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

Pakistan s Disastrous Performance Continues New Zealand Wins Series 4-1

లక్ష్యాన్ని సాధించిన న్యూజిలాండ్
129 పరుగుల సులభమైన లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు అలవోకగా ఛేదించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 38 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 19 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో ఫిన్ అలెన్ 12 బంతుల్లో 27 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ కేవలం 10 ఓవర్లరోనే లక్ష్యాన్ని చేరుకుంది. 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ 5 మ్యాచ్ ల సిరీస్ లో పాకిస్థాన్ రెండో టీ20లో మాత్రమే గెలిచింది. మిగిలిన 4 మ్యాచ్ లలో పాకిస్థాన్ కు నిరాశ ఎదురైంది.

5 వికెట్లు పడగొట్టిన జేమ్స్ నీషమ్
న్యూజిలాండ్ విజయంలో క్రెడిట్ జేమ్స్ నీషమ్ కు దక్కుతుంది. ఎందుకంటే జేమ్స్ నీషమ్ ఈ మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. తాను వేసిన 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు జాకబ్ డఫీ 2 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున సూఫియా ముఖీమ్ రెండు వికెట్లను పడగొట్టాడు.

Story first published: Wednesday, March 26, 2025, 16:15 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+