పాండ్యా స్పెల్లింగ్ తప్పు: పాక్ జర్నలిస్ట్‌ను ఆడుకున్న నెటిజన్లు
హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో హార్ధిక్ పాండ్యా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
దీంతో తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై డక్ వర్త్ లూయిస్ పద్ధతిన భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాండ్యా కేవలం 66 బంతుల్లో 83 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పాండ్యా వీరోచిత ఇన్నింగ్సే ఆమెను భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.
పాండ్యాను బెన్ స్టోక్స్‌తో పోల్చడం మాత్రం అన్యాయం
తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన తర్వాత ఆమె తన ట్విట్టర్‌లో 'పాండ్యా భవిష్యత్తులో మంచి ఆల్‌రౌండర్ కాగలడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడిని భారత మీడియా బెన్‌స్టోక్‌తో పోల్చడం మాత్రం న్యాయం కాదనిపిస్తోంది' అని ట్వీట్టర్‌లో ట్వీట్ చేసింది. అందులో పాండ్యా బదులు పాండే అని స్పెల్లింగ్ తప్పుగా రాసింది.
సోషల్ మీడియాలో మండిపడుతున్న అభిమానులు
దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 'కనీసం పాండ్యా స్పెల్లింగ్ కూడా రాయడం రాదు... నువ్వు అతడి గురించి మాట్లాడుతున్నావా? ఇలాంటి ట్వీట్ల ద్వారా చీప్ జర్నలిజం చేసేందుకు బాగానే ప్రయత్నించావుగా' అంటూ ఓ నెటిజన్ చురకలంటించాడు.
స్టోక్స్ కంటే పాండ్యా చాలా బెటర్
'అవును ఫజీలా.. నవ్వు చెప్పింది కరెక్టే.. స్టోక్స్ కంటే పాండ్యా చాలా బెటర్' అని మరొకరు స్పందించగా 'పాకిస్తాన్‌లో పాండ్యాలాంటి ఆటగాళ్లు లేరనేకదా నీబాధ... కోహ్లీ, పాండ్యా లాంటి ఆటగాళ్ల కోసం జస్ట్ కలలు కంటూ ఉండు' అని మరో నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు.
పాండ్యా భారత్ బెన్ స్టోక్స్
ఇదిలా ఉంటే తొలి వన్డేలో పాండ్యా భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'పాండ్యా భారత్ బెన్ స్టోక్స్' అంటూ ఇటీవల కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు బెన్ స్టోక్స్‌ను మించి రాణించేలా పాండ్యా దూకుడుతో వెళ్తున్నాడని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications