
హైదరాబాద్: భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షంలో తడిసిపోతున్నాడు. అది ఎవరి దగ్గర్నుంచో కాదు. భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ అభిమానుల నుంచి వస్తున్నాయి.
రెండో టెస్టుకు గాను భారత జట్టు ధావన్ విడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే. అయినా పాకిస్థాన్ క్రీడాభిమానులు ధావన్‌ను పైకెత్తేస్తున్నారు. కారణమేమిటంటే బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతూ తలకు బంతి తగిలి షోయబ్ మాలిక్ గాయానికి గురైయ్యాడు. ఈ విషయంపై ధావన్ పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ యోగక్షేమాలను వాకబు చేశాడట.
మాలిక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో 'నేను త్వరగానే కోలుకుంటాననే నమ్మకం నాకుంది. ఆ అల్లా నన్ను కాపాడతాడు.' అని పోస్ట్ చేశాడు. దానికి బదులుగా ధావన్ 'నువ్వు త్వరగా కోలుకుని మళ్లీ పిచ్‌లో అడుగుపెట్టాలి.' అని సమాధానమిచ్చాడు.
ఈ ట్వీట్‌లకు పాకిస్థాన్ దేశస్థులు ధావన్‌కు పలు రకాలుగా పొగుడుతున్నారు. క్రీడా స్ఫూర్తి చూపించావని, నువ్వు గ్రేట్ అని, లవ్యూ సర్ అని రిప్లైలు తెగ పంపిస్తున్నారు.