For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశం మారొచ్చు గాక... తలాపై ప్రేమ మారదు: పాక్ వరల్డ్‌కప్ జెర్సీపై ధోని పేరు

Pakistani fan puts MS Dhoni’s name on World Cup 2019 jersey, sends Twitterati into frenzy

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... టీమిండియా మూడు ఐసీసీ ప్రధాన ట్రోఫీలను(ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్) అందించిన ఏకైక కెప్టెన్. అలాంటి ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన అభిమానులు సైతం ఉన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

పాకిస్థాన్‌కు చెందిన షెహజాద్ ఉల్ హాసన్ అనే యువకుడు ధోనికి వీరాభిమాని. వరల్డ్‌కప్ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు ధరించనున్న గ్రీన్ జెర్సీపై షెహజాద్ ఉల్ హాసన్ తన అభిమాన క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరుని వెనుకవైపు రాయించుకోవడంతో ధోని ట్రేడ్ మార్క్ No 7ని కూడా ప్రింట్ చేయించాడు.

కస్టమ్ జెర్సీ

ఈ కస్టమ్ జెర్సీని అందుకున్న షెహజాద్ ఉల్ హాసన్ తన ట్విట్టర్‌లో పంచుకుంటూ ధోనీని కూడా ట్యాగ్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ "దేశం మారొచ్చు గాక.. తలాపై ఉన్న ప్రేమ మాత్రం మారదు" అని ట్వీట్ చేశాడు.

మరో ఆరు రోజుల్లో

మరో ఆరు రోజుల్లో

మరో ఆరు రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి

మరోవైపు ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. టోర్నీలో భాగంగా విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీంతో టోర్నీ కోసం ఇప్పటికే పలువురు అభిమానులు లండన్‌కు చేరుకున్నారు.

జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్

జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్

ఇక, టోర్నీకే హైలెట్‌గా నిలవనున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 16న ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా జరగనుంది. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. కాగా, 2017లో ఇదే ఇంగ్లాండ్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ విజయం సాధించింది.

వరల్డ్‌కప్‌లో భారత జట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ

Story first published: Friday, May 24, 2019, 18:25 [IST]
Other articles published on May 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+