న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్ షాహిద్ ఆఫ్రిదీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆశను వ్యక్తం చేశాడు. దేశ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని అనిపిస్తోందని ఆయన అన్నారు.
తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, అయితే కొంత మంది శ్రేయోభిలాషులు వద్దని సలహా ఇస్తున్నారని, తన దృష్టిలో రాజకీయ నాయకుడు ప్రజా సేవకుడని, ప్రజలకు సేవ చేయాలని ఆయన అన్నారు. కాగా, తాను పాకిస్తాన్ తరఫున ట్వంటీ20 మ్యాచుల్లో ఆడుతానని చెప్పారు.

జాతీయ లేదా దేశీయ లేదా లీగ్ స్థాయిల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతానని, తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నానని ఆన అన్నారు. తన షాహిద్ అఫ్రిదీ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల కోసం పాఠశాలను ప్రారంభిస్తానని ఆయన చెప్పారు.