
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. మూడేళ్లుగా ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్ నిర్వహిస్తోంది. ఇందులో యథావిధిగా మోసానికి పాల్పడ్డాడంటూ ఓ క్రికెటర్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. దీనికిగాను షాజైబ్ హసన్‌ను ఏడాది పాటు మ్యాచ్‌ల నుంచి నిషేదిస్తూ ఆజ్ఞలు జారీ చేసింది.
అసలు జరిగిందేమిటంటే:
షాజైబ్ హసన్ 2017వ సంవత్సరం నుంచి కరాచీ కింగ్స్ జట్టు తరపున పీఎస్ఎల్‌లో ఆడుతున్నాడు. మార్చి 17న అతను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ వార్తలు వచ్చాయి. అతను పది లక్షల రూపాయలకు ఆశపడి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఈ నేరంతో పాటుగా అతనిపై మొత్తం మూడు నేరాలకు శిక్షను విధించారు. అతనితో పాటుగా తోటి క్రికెటర్లను సైతం ఫిక్సింగ్‌లోనికి లాగేందుకు ప్రయత్నించడం, ఫిక్సింగ్ చేయమంటూ అతన్ని సంప్రదించిన వారి పేర్లు చెప్పకపోవడం, స్వయంగా ఫిక్సింగ్ పాల్పడడం.
దీంతో సంవత్సర కాలం పాటు నిషేదానికి గురి కావాల్సి వచ్చింది. అప్పటి సంఘటనలో ఖలీద్ లతీఫ్, షార్జీల్ ఖాన్‍ల పేర్లు మాత్రమే బయటికి వచ్చినా, కొద్ది కాలం తర్వాత నజీర్ జంషెడ్, మొహమ్మద్ ఇర్ఫాన్‌లు మీడియా కంటపడ్డారు. వీరిద్దరూ ఏదో వంక మీద ఫిక్సింగ్‌కు పాల్పడే యత్నంలోనే దొరికిపోయారు.
అప్పట్లో జరిగిన ఘటనకు పాకిస్థాన్ జట్టుకు మరోసారి తలవంపులు తెచ్చిపెట్టింది. దీంతో ఈ సారి జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ నజాం సేథీ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది జరిగిన పొరబాట్లను పునరావృతం కాకుండా నియమాలను కట్టుదిట్టం చేశారు.