Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూరీడు కన్నా బెటర్ అవుతా.. పాక్ 360 ప్లేయర్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో 360 డిగ్రీస్ ప్లేయర్ ఎవరు అంటే చటుక్కున అందరూ చెప్పే పేరు సూర్యకుమార్ యాదవ్. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిల్లీర్స్ రిటైర్ అయిన తర్వాత అతని అడుగు జాడల్లో నడుస్తూ.. మైదానం నలువైపులా భారీ షాట్లతో అలరిస్తున్న ప్లేయర్ సూర్య. ఇప్పుడు అలాంటి ప్లేయర్ పాకిస్తాన్‌లో కూడా కనిపించాడు. అంతేకాదు, తను తలుచుకుంటే సూర్యను దాటేస్తానని అంటున్నాడు.

ఆ ప్లేయర్ ఎవరో కాదు మహమ్మద్ హారిస్. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్తాన్-ఎ టీంకు కెప్టెన్‌గా ఉన్న హారిస్.. దూకుడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్ సీనియర్ టీంకు కూడా ఆడినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాడీ వికెట్ కీపింగ్ బ్యాటర్. అయితే అతని వయసు ఇంకా 22 సంవత్సరాలే. కాబట్టి భవిష్యత్తులో పాక్ బ్యాటింగ్‌లో అతను కీలకంగా మారే అవకాశం ఉంది.

Mohammad Haris

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో హారిస్.. తనను సూర్యకుమార్ యాదవ్‌తో పోల్చడం గురించి మాట్లాడాడు. 'మమ్మల్ని ఇలా అప్పుడే కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. సూర్య 32-33 ఏళ్ల ప్లేయర్. నేను ఇంకా 22 ఏళ్ల కుర్రాడినే. ఆ స్థాయికి చేరాలంటే నేను అంత బాగా కష్టపడాలి కూడా' అని చెప్పాడు. అతన్ని కూడా ఫ్యాన్స్ మరో 360 డిగ్రీస్ ప్లేయర్‌గా చెప్పుకోవడం గురించి కూడా హారిస్ ప్రస్తావించాడు.

'సూర్య ఒక లెవెల్‌లో ఉన్నాడు. డివిలియర్స్ మరో లెవెల్‌లో ఉన్నాడు. అలాగే నాకంటూ ఒక లెవెల్ ఉంటుంది. నేను వాళ్ల పేరు యూజ్ చేసుకోకుండా నాకంటూ 360 డిగ్రీ క్రికెటర్‌గా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నా' అని చెప్పాడు. 'సూర్య ఆడే క్రికెట్ వేరు, నేను ఆడే క్రికెట్ వేరు. నేను సరిగా ప్రాక్టీస్ చేస్తే అతని కన్నా మెరుగైన ప్లేయర్ అవుతా. లేదంటే అతని తర్వాతే మిగిలిపోతా' అన్నాడీ యువ బ్యాటర్.

Story first published: Wednesday, July 19, 2023, 16:34 [IST]
Other articles published on Jul 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+