For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ Vs PAK: చెలరేగిన మహ్మద్ నవాజ్.. ట్రై సిరీస్ గెలుచుకున్న పాక్.. ఇది టీమిండియాకు హెచ్చరికేనా..!

Pakistan won the tri-series by 5 wickets against New Zealand in the final

టీ20 వరల్డ్ కప్ కు ముందు పాకిస్థాన్ ట్రై సిరీస్ గెలుచుకుంది. ఈ గెలుపు ఉత్సాహంతో ఈ నెల 23న ఇండియాతో తలపడనుంది. న్యూజిలాండ్ తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహ్మద్ నవాజ్ 22 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 38 బంతుల్లో రెండు సిక్స్ లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. గ్లేన్ ఫిలిప్స్ 29, చంపాన్ 25 పరుగులు చేశారు.

ఇఫ్తికార్ అహ్మద్
పాకిస్థాన్ బౌలర్లలో నసీం షా, రవుఫ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షాదబ్ ఖాన్, నవాజ్ ఒక్కో వికెట్ తీశారు. 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పయి 168 చేసి విజయం సాధించింది. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. చివర్లో మహ్మద్ నవాజ్, ఇఫ్తికార్ అహ్మద్ ధాటిగా ఆడడంతో పాకిస్థాన్ విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్ వెల్ రెండు వికెట్లు తీయగా.. సౌథి, టిక్నెనర్, సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఫామ్ లో మహ్మద్ నవాజ్
అంతకు ముందు మ్యాచ్ లో పాక్ బంగ్లా దేశ్ పై విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో నవాజ్ 20 బంతుల్లో 45 పరుగులే చేశాడు. ప్రస్తుతం అతను మిడిలార్డర్ లో స్థిరపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ 23న భారత్ తో తలపడనుంది. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్, నవాజ్ ఫామ్ లో ఉన్నారు. టీమిండియాతో మ్యాచ్ లో వీరు కీలం కానున్నారు. వీరిని ఔట్ చేయడం భారత బౌలర్లకు సవాలే..

Story first published: Friday, October 14, 2022, 13:39 [IST]
Other articles published on Oct 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+