Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BAN Vs PAK: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రిజ్వాన్, అజామ్.. బంగ్లాపై పాక్ విజయం..

Pakistan won by 7 wickets against Bangladesh

ట్రై సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జరిగిన 6వ టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. లిట్టన్ దాస్, షకిబుల్ హసన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. లిట్టన్ దాస్ 42 బంతుల్లో 2 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 69 పరుగులు చేశాడు.

షకిబుల్ హసన్

కెప్టెన్ షకిబుల్ హసన్ 42 బంతుల్లో మూడు సిక్స్ లు, ఏడు ఫోర్లతో 68 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసిమ్ షా, మహ్మద్ వసిమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నవాజ్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం 174 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

మహ్మద్ రిజ్వన్

వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వన్ 56 బంతుల్లో 4 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ అజామ్ 40 బంతుల్లో 9 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. చివర్లో మహ్మద్ నవాజ్ 20 బంతుల్లో ఒక సిక్స్, 5 ఫోర్లతో 45 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ట్రై సిరీస్ న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది.

9 వికెట్ల తేడాతో

అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ను కివీస్ బౌలర్లు టిమ్ సౌథీ, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ 130 పరుగులకే పరిమితం చేశారు. లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే రాణించడంతో విజయం సాధించింది.

Story first published: Thursday, October 13, 2022, 14:48 [IST]
Other articles published on Oct 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+