భారత్-పాక్ వన్డే సిరిస్‌పై ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్!

హైదరాబాద్: ఐసీసీ మహిళా ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌లో పాక్ మహిళా జట్టు పర్యటన రద్దయ్యే అవకాశం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా పాక్ మహిళల జట్టు ఈ ఏడాది నవంబర్‌లో మూడు వన్డేల సిరిస్ ఆడాల్సి ఉంది.
ఇప్పుడు ఆ పర్యటనను భారత్ రద్దు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ రద్దయ్యే అవకాశం ఉందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
ఈ సందర్భంలో ఓ పీసీబీ అధికారి మాట్లాడుతూ "పాక్ మహిళా జట్టు భారత పర్యటన కోసం బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. ఈ సిరిస్‌కు ఆతిథ్యం ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో సిరీస్ రద్దు అయ్యే అవకాశం ఉంది" అని అన్నారు. మరోవైపు భారత్‌లో పాక్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని బోర్డు పేర్కొంది.
"కేంద్రం ఆదేశాల మేరకు మేం నిర్ణయాలు తీసుకుంటాం. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు బీసీసీఐ ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలనుసారంగా నడుచుకుంటాం" అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications