గెట్ రెడీ ఫర్ సండే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్! హాంకాంగ్‌ను చిత్తు చేసిన పాక్.. సూపర్ 4 షెడ్యూల్ ఇదే..!

సూపర్ 4 బెర్త్ కోసం పాక్ వర్సెస్ హాంకాంగ్ మధ్య జరిగిన నేటి మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ఆ జట్టు బ్యాటర్లు మహమ్మద్ రిజ్వాన్ (57బంతుల్లో 78పరుగులు 6ఫోర్లు 1సిక్సర్ నాటౌట్), ఫాకర్ జమాన్ (53పరుగులు 41బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), ఖుష్ దిల్ (35పరుగులు 15బంతుల్లో 5సిక్సర్లు నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 193పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక 194పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంకాంగ్ పూర్తిగా తడబడింది. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి 38పరుగులకే ఆలౌటైంది. తద్వారా పాక్ 155పరుగుల తేడాతో విజయం పొందింది. ఇక ఈ విజయంతో సూపర్ 4 బెర్త్ దక్కించుకున్న పాక్ మరోసారి ఇండియాతో ఆదివారం నాటి మ్యాచ్‌లో తలపడనుంది.
ఒక్కరు కూడా 10పరుగులు చేయలేదు
ఇక ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (9పరుగులు 8బంతుల్లో 1ఫోర్) కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఇక తర్వాత రిజ్వాన్, ఫాఖర్ జమాన్ 10ఓవర్ల వరకు నిదానంగా ఆడారు. ఆ తర్వాత ఎటాక్ చేశారు. చివర్లో ఖుష్ దిల్ ఖుషీ చేసే ఇన్నింగ్స్ ఆడారు. హాంకాంగ్ బౌలర్లు సైతం ఒత్తిడికి లోనైయ్యారు. ఫలితంగా 18ఎక్స్ ట్రా పరుగులు వచ్చాయి. తర్వాత ఛేదనకు దిగిన హాంకాంగ్ పాక్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. కెప్టెన్ నిజాఖత్ ఖాన్ (2), ముర్తాజా (2), బాబర్ హయత్ (0), కించిత్ షా (6), ఐజాజ్ ఖాన్ (1), స్కాట్ (4), జీషన్ అలీ (3), హరూన్ అర్షద్ (3), అయుష్ శుక్లా (1), మహమ్మద్ గజన్ ఫర్ (0), ఎసాన్ ఖాన్ (1నాటౌట్) చిత్తుచిత్తుగా ఔటయ్యారు. ఒక్కరు కూడా 10 పరుగులకు మించి స్కోరు చేయలేదు. దీంతో 38పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో నషీమ్ షా 2, దహానీ 1, షాదాబ్ ఖాన్ 4, నవాజ్ 3వికెట్లు తీసి హాంకాంగ్ పతనాన్ని పట్టుకున్నారు.
తుది జట్లు :
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షానవాజ్ దహానీ
హాంకాంగ్ (ప్లేయింగ్ XI): నిజాకత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, జీషన్ అలీ, స్కాట్ మెక్ కెచ్నీ (వికెట్ కీపర్), హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ గజన్‌ఫర్
సూపర్ 4 షెడ్యూల్
సెప్టెంబర్ 3 రాత్రి 7.30కు ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ శ్రీలంక, షార్జా క్రికెట్ స్టేడియం (శనివారం)
సెప్టెంబర్ 4 రాత్రి 7.30కు ఇండియా వర్సెస్ పాకిస్థాన్, దుబాయ్ స్టేడియం (ఆదివారం)
సెప్టెంబర్ 6 రాత్రి 7.30కు ఇండియా వర్సెస్ శ్రీలంక, దుబాయ్ స్టేడియం (మంగళవారం)
సెప్టెంబర్ 7 రాత్రి 7.30కు పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, దుబాయ్ స్టేడియం (బుధవారం)
సెప్టెంబర్ 8 రాత్రి 7.30కు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, దుబాయ్ స్టేడియం (గురువారం)
సెప్టెంబర్ 9 రాత్రి 7.30కు శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్, దుబాయ్ స్టేడియం (శుక్రవారం )
సెప్టెంబర్ 11 రాత్రి 7.30కు ఫైనల్ మ్యాచ్ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య (ఆదివారం)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications