Pakistan vs Netherlands : చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన నెదర్లాండ్స్‌పై గెలిచిన పాకిస్థాన్..

మంగళవారం నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమాముల్ హక్ 2పరుగులకే ఔటయినప్పటికీ.. కెప్టెన్ బాబర్ ఆజం (85 బంతుల్లో 74, 6 ఫోర్లు, 1 సిక్సర్), ఫాఖర్ జమాన్ (109బంతుల్లో 109పరుగులు 12ఫోర్లు, 1సిక్సర్) పాక్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాఖర్ తన ఏడో సెంచరీ అందుకున్నాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (28 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల కోల్పోయి 314పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, బాస్ ది లీడే తలా 2వికెట్లు తీయగా.. కింగ్మా ఓ వికెట్ తీశాడు.
వీరోచితంగా పోరాడిన నెదర్లాండ్స్
ఇక ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ వీరోచితంగా పోరాడింది. పాకిస్థాన్ బౌలర్లను డచ్ బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. మన ఇండియన్ సంతతికి చెందిన కుర్రాడు విక్రమ్ జిత్ సింగ్ (65పరుగులు 98బంతుల్లో 5ఫోర్లు) వికెట్ కాపాడుతూ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. టామ్ కూపర్ (65పరుగులు 54బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (71పరుగులు 60బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) వీరోచితంగా పోరాడారు. ఒకానొక దశలో నెదర్లాండ్స్ గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే చివర్లో వికెట్లు కోల్పోవడం.. పాక్ బౌలర్లు చివరి మూడు ఓవర్లలో కట్టుదిట్టంగా వేయడంతో నెదర్లాండ్స్ 8 వికెట్లు కోల్పోయి 298పరుగులు చేసింది. తద్వారా పాక్ 16పరుగుల తేడాతో గెలుపొందింది.
హమ్మయ్యా ఎట్టకేలకు గెలిచాం : బాబర్ ఆజామ్
ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకు ఫాఖర్ జమాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. హమ్మయ్యా గెలిచినందుకు నేను ఉపశమనం పొందాను. ఫాఖర్ అద్భుత సెంచరీ చేశాడు. మేం ఇంకా చాలా బాగా ఆడాల్సింది. కానీ ఆడలేకపోయాం. ఇక్కడ పిచ్‌లు సవాలు విసురుతున్నాయి. వికెట్‌పై కాస్త తేమ ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నాడు. ఇక చివరి మూడు ఓవర్లలో 18బంతుల్లో 41పరుగులు చేయాల్సిన దశలో క్రీజులో స్కాట్ ఎడ్వర్డ్స్, వాన్ బీక్ (28పరుగులు 24బంతుల్లో 3ఫోర్లు) ఉండడంతో నెదర్లాండ్ అద్భుతం చేస్తుందేమో అనిపించింది. అయితే హరిష్ రౌఫ్, నషీమ్ షా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి వాన్ బీక్‌ను ఔట్ చేయడం, ఆ తర్వాత మరో వికెట్ కోల్పోవడంతో క్రీజులో ఎడ్వర్డ్స్ కూడా తడబడ్డంతో నెదర్లాండ్స్‌కు ఓటమి తప్పలేదు. ఏదేమైనా పసికూన పాక్‌ను వణికించిందనే చెప్పాలి.
తుది జట్లు
నెదర్లాండ్స్ జట్టు : ప్లేయింగ్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, టామ్ కూపర్, బాస్ డి లీడే, స్కాట్ ఎడ్వర్డ్స్ (c & wk), తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, వెస్లీ బరేసి, వివియన్ కింగ్మా
పాకిస్థాన్ జట్టు : ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), అఘా సల్మాన్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం Jr, హరిస్ రవూఫ్, నసీమ్ షా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications