Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌దే టైటిల్: భారత జ్యోతిష్కుడి భవిష్యవాణి

న్యూఢిల్లీ: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా వరల్డ్‌కప్‌ నెగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఓ భారత జ్యోతిష్కుడు భవిష్యవాణి చెప్పాడు. శాస్ర్తీయ పద్ధతిలో చేసిన తన పరిశోధనల ప్రకారం పాకిస్థాన్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరితే టైటిల్‌ సాధించే చాన్సులు అధికంగా ఉన్నాయని జ్యోతిష్కుడైన గ్రీన్‌స్టోన్‌ లోబో చెప్పాడు.

ఒకవేళ భారత-పాక్‌ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరిగినా కూడా అఫ్రీదిసేనే పైచేయిగా నిలుస్తుందన్నాడు. సాధారణ సిరీస్‌ల్లో ధోనీ విజయాలు సాధిస్తూ ఉండొ చ్చు గానీ ప్రపంచ క్‌పలో మాత్రం మహీకి అదృష్టం కలసిరాదని చెప్పాడు. అయితే ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ నెల 19 భారత-పాక్‌ సమరంలో మాత్రం టీమిండియానే నెగ్గే అవకాశాలున్నాయన్నాడు.

Pakistan will win World T20 title, predicts Indian astrologer

కోల్‌కతా నుంచి వెలువడే ప్రముఖ బెంగాలీ పత్రిక ఆనందబజార్‌లో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించాడు. షాహిద్ ఆఫ్రిదీ గ్రహస్థితులను మాత్రం ఆయన విశ్లేషించలేదు. గ్రహస్థితి ధోనీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన తెలిపాడు.

Pakistan will win World T20 title, predicts Indian astrologer

మార్చి 19 ధోనీకి అనుకూలంగా ఉందని చెప్పారు. దాంతో ఈడెన్ గార్డెన్‌లో జరిగే లీగ్ పోటీలో ధోనీ సేన విజయం సాధిస్తుందని చెప్పారు. భారత జ్యోతిష్కుడి భవిష్యవాణి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఆనంద బజార్ పత్రిక వ్యాసం పాకిస్తాన్ మీడియాలో ప్రముఖంగా వస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+