'ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన కంటే పాకిస్థాన్‌యే బెటర్'


హైదరాబాద్: టీమిండియా కంటే పాకిస్థాన్‌యే బాగా ప్రిపేర్ అయ్యారంట. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు తామే బాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న కోహ్లీ సేన పేలవంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ టెస్టుల్లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో కోహ్లీ సేన పర్యటన, ప్రాక్టీస్‌పై విమర్శలు చేస్తున్నారు.

2016లోనే ఇంగ్లాండ్‌లో పర్యటించా:
ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా స్పందించాడు. ‘ఇప్పటి వరకు నేను రెండుసార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించాను. ఆ రెండు పర్యటనల్లో పాక్ తన పోరాట ప్రదర్శనను కనబరిచింది. ఆసియా జట్టు ఏదైనా ఇంగ్లాండ్‌లో పర్యటించిన సమయంలో ఇబ్బందులు తప్పవు. దీని నుంచి భారత్ మినహాయింపేమీ కాదు. అందుకే ఇప్పుడు భారత్ ఇబ్బంది పడుతోంది. 2016లో నేను మొదటిసారి ఇంగ్లాండ్‌లో పర్యటించాను.'

25 రోజులు ముందుగానే వెళ్లి.. 10 రోజుల క్యాంపులో:
'టెస్టు సిరీస్ ప్రారంభానికి 25 రోజులు ముందుగానే అక్కడికి వెళ్లాం. 10 రోజుల క్యాంపులో పాల్గొన్నాం. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. ఇలా చేయడం వల్ల మేము బాగా ఆడగలిగాం. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో ముగించాం. మిస్బా ఉల్ హాల్ కెప్టెన్సీలో లార్డ్స్, ఓవల్‌లో విజయం సాధించాం. ఆ తర్వాత ఈ ఏడాది నా కెప్టెన్సీలోనే ఇంగ్లాండ్‌లో పర్యటించాం.'

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా
' మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఇంగ్లాండ్‌ను ఢీకొన్నాం. తొలి టెస్టులో విజయం సాధించాం... రెండో టెస్టులో ఓడాం. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్నాం. ఇంగ్లాండ్‌తో ఆడేందుకు మేము భారత్ కంటే బాగా సన్నద్ధమైనట్లు ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా నాకు అనిపిస్తోంది' అని సర్ఫరాజ్ అన్నాడు.

భారత్ కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి:
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత్ కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఎసెక్స్ జట్టుతో నాలుగు రోజులు జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్‌ను మూడు రోజులకు కుదించుకుంది. వరుసగా రెండు టెస్టుల పరాజయాలతో టీమిండియాపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ను కుదించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శుక్రవారం మూడో టెస్టు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications