హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై తమకున్న మెరుగైన రికార్డుని ఈ సీజన్‌లో కూడా కొనసాగిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ సేనతో జరిగే తొలిమ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. వార్మప్ మ్యాచ్‌ల నుంచే రాణించి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తామని అన్నాడు.
'మిగతా టోర్నీలతో పోలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మాకు భారత్‌పై మెరుగైన రికార్డు ఉంది. దాన్ని కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాం. భారత్‌తో పోరు ఆసక్తికరం. ఇటీవలే వెస్టిండీస్‌లో చక్కటి సిరీస్ ఆడాం. ఆటగాళ్లందరూ మెరుగైన ప్రదర్శన చేశారు' అని సర్ఫరాజ్ అన్నాడు.

కాగా, ఛాంఫియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌పై పాక్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 2013లో ధోని నేతృత్వంలోని టీమిండియా... పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.
కాగా, జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంఫియన్స్ ట్రోఫీలో భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జూన్ 4వ తేదీన తలపడనుంది. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి విదేశీ గడ్డపై పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ధోని బాటలోనే కోహ్లీ కూడా టీమిండియాకు విజయాన్ని అందిస్తాడా? లేదా చూడాలి మరి.
2004లో తొలి ఓటమి
కెన్యాపై గెలిచినా, పాకిస్తాన్ చేతిలో ఓడటంతో భారత్ సెమీస్ చేరలేకపోయింది. ఎడ్జిబాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం రాహుల్ ద్రవిడ్(67) ఒక్కడే రాణించడంతో 50 ఓవర్లలో 200 పరుగులు చేసింది. షోయబ్ అక్తర్, నవీద్ ఉల్ హసన్ చెరో 4 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహ్మద్ యూసఫ్ చెలరేగడంతో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
2009లో కూడా పాక్‌దే విజయం
2008లోనే పాకిస్తాన్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... అక్కడి పరిస్థితుల కారణంగా టోర్నీ అక్కడ సాధ్యం కాకపోవడంతో ఏడాది ఆలస్యంగా వేదికను దక్షిణాఫ్రికాకు మార్చారు. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవ్వడం,
ఆపై వర్షంతో ఆసీస్ మ్యాచ్ రద్దు కావడంతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. షోయబ్ మాలిక్ సెంచరీ(128), మహ్మద్ యూసఫ్ హాఫ్ సెంచరీ (87)లతో రాణించడంతో పాక్ 302 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 248 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ అర్ధసెంచరీ(76)తో రాణించాడు.
2015లో ఫలితాన్ని మార్చిన ధోని
ధోని నేతృత్వంలోని టీమిండియా పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసింది. గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్‌లను వరుసగా ఓడించింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో 165 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 19.1 ఓవర్లలో 102 పరుగులు చేసిన భారత్ మరో 17 బంతులుండగానే 8 వికెట్లతో విజయం సాధించింది. వర్షం కారణంగా 20-20 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌పై 5 పరుగులతో నెగ్గి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది.
2017- కోహ్లీ నేతృత్వంలో టీమిండియా
మిని వరల్డ్ కప్‌గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలైన భారత్-పాక్‌లు నాలుగో సారి తలపడుతున్నాయి. జూన్ 4న భారత్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలవనుంది. విదేశీ గడ్డపై కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ టోర్నీ ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో 1-2తో పాకిస్తాన్‌పై ఉన్న గెలుపోటముల రికార్డును మెరుగు పరుచుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.