For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ టెండూల్కర్ సరసన: ఎలైట్ జాబితాలోకి షోయబ్ మాలిక్

By Nageshwara Rao
Pak's Shoaib Malik Joins Elite List After Achieving Rare ODI Double
Pakistan vs Zimbabwe: Shoaib Malik achieves spectacular ODI double, joins Sachin Tendulkar in elite list

హైదరాబాద్: వయసు పెరుగుతోన్న కొద్దీ, తనలోని ఆట మరింతగా రాటుదేలుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి స్పిన్నర్‌గా అరంగేట్రం చేసిన అతడు పాకిస్థాన్ జట్టులో ఆల్ రౌండర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇంతకీ ఎవరా క్రికెటర్ అని అనుకుంటున్నారు.

భారత టెన్నిస్ సంచలనం సానియా మిర్జా భర్త షోయబ్ మాలిక్. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో షోయబ్‌ మాలిక్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బలవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 15 బంతుల్లో 18 పరుగులు సాధించాడు.

దీంతో వన్డేల్లో ఏడు వేల పరుగుల మార్కును చేరిన ఎనిమిదో పాకిస్తాన్‌ ఆటగాడిగా అరుదైన గుర్తింపు సాధించాడు. అదే సమయంలో మాలిక్ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో 7000లకు పైగా పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు సాధించిన ఏడో క్రికెటర్‌గా మాలిక్‌ నిలిచాడు.

రెండో క్రికెటర్‌గా షోయబ్ మాలిక్‌ రికార్డు

రెండో క్రికెటర్‌గా షోయబ్ మాలిక్‌ రికార్డు

ఇక, పాకిస్థాన్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా షోయబ్ మాలిక్‌ రికార్డు సాధించాడు. షోయబ్ మాలిక్‌కు ముందు పాకిస్థాన్ తరుపున షాహిద్ అఫ్రిది ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో ఏడు వేలకు పైగా పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు సాధించిన వారిలో స్టీవ్‌ వా, సచిన్‌ టెండూల్కర్‌, జయసూర్య, కల్లిస్‌, ఆఫ్రిది, క్రిస్‌ గేల్‌లు ఉన్నారు.

ఏడు వేల పరుగుల క్లబ్‌లో చేరిన మాలిక్

ఏడు వేల పరుగుల క్లబ్‌లో చేరిన మాలిక్

ఈ మ్యాచ్‌కి ముందు 3 పరుగుల దూరంలో ఉన్న షోయబ్ మాలిక్ ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో వన్డేలో ఏడు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్‌ 18 పరుగులు చేసిన ఔటయ్యాడు. ఈ ఘనతను షోయబ్ మాలిక్ 266 వన్డేల్లో సాధించడం విశేషం. ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది 395 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య 323 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షోయబ్ మాలిక్

ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షోయబ్ మాలిక్

1999లో షార్జా వేదికగా జరిగిన కోకాకోలా ఛాంపియన్స్ ట్రోఫీలో మాలిక్ పాక్ తరుపున అరంగేట్రం చేశాడు. తొలుత ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షోయబ్ మాలిక్ ఆ తర్వాత మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. 2015లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయానికి మాలిక్ 1898 పరుగులు సాధించాడు. ఇటీవలే, టీ20ల్లో 2000 పరుగులు నమోదు చేసిన మూడో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

జింబాబ్వే పర్యటనలో పాక్ బ్యాట్స్‌మెన్లు పరుగుల వరద

జింబాబ్వే పర్యటనలో పాక్ బ్యాట్స్‌మెన్లు పరుగుల వరద

కాగా, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో 131 పరుగుల తేడాతో విజయం సాధించి పాక్‌ ఐదు వన్డేల సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (110), బాబర్‌ ఆజమ్‌ (106 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగారు.

వన్డేల్లో ఫకార్ జమాన్ అరుదైన రికార్డు

వన్డేల్లో ఫకార్ జమాన్ అరుదైన రికార్డు

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన మరో ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ (85) వన్డేల్లో అత్యంత వేగంగా (18 ఇన్నింగ్స్‌) వెయ్యి పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు వివ్‌ రిచర్డ్స్‌, కెవిన్‌ పీటర్సన్‌, జొనాథన్‌ ట్రాట్‌, డికాక్‌, బాబర్‌ ఆజమ్‌ (21 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరిస్‌లో అత్యధిక పరుగులు (515) చేసిన ఆటగాడిగానూ జమాన్‌ నిలిచాడు.

Story first published: Monday, July 23, 2018, 14:06 [IST]
Other articles published on Jul 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+