For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌లో క్రికెట్‌ సందడి: వరల్డ్ ఎలెవెన్‌పై ఆతిథ్య జట్టు బోణీ

ఎనిమిదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు తమ దేశానికి వచ్చారన్న ఆనందంలో పాకిస్థాన్ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేశారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఎనిమిదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు తమ దేశానికి వచ్చారన్న ఆనందంలో పాకిస్థాన్ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. వివిధ జట్లకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన వరల్డ్‌ ఎలెవన్‌ జట్టుతో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య పాకిస్థాన్ శుభారంభం చేసింది.

20 పరుగుల తేడాతో పాక్ విజయం

20 పరుగుల తేడాతో పాక్ విజయం

లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 20 పరుగుల తేడాతో వరల్డ్‌ ఎలెవన్‌ను పాకిస్థాన్ ఓడించింది. టాస్‌ గెలిచిన వరల్డ్ ఎలెవెన్ కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.

బాబర్‌ అజామ్‌ అద్భుత ప్రదర్శన

బాబర్‌ అజామ్‌ అద్భుత ప్రదర్శన

పాక్ ఆటగాళ్లలో బాబర్‌ అజామ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 52 బంతుల్లో 86 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. షోయబ్‌ మాలిక్‌ (38), అహ్మద్‌ షెజాద్‌ (39) మెరిశారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (4) పరుగులతో నిరాశపరిచినా చివర్లో ఇమాద్ వసీం (15 నాటౌట్) భారీ సిక్సర్లు బాదాడు.

7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవన్

7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవన్

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన వరల్డ్‌ ఎలెవన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులే చేసింది. వరల్డ్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్లలో ఆమ్లా (26), టిమ్‌ పైన్‌ (25), డుప్లెసిస్‌ (29) ఇన్నింగ్స్‌లను బాగానే ఆరంభించినా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారు పెద్దగా రాణించలేదు.

అజామ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు

అజామ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు

చివర్లో డారెన్‌ సామి (29 నాటౌట్‌) పోరాడినప్పటికీ జట్టు ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. పాక్‌ బౌలర్లలో సోహైల్‌ ఖాన్‌, రయీస్‌, షాదాబ్‌ ఖాన్‌ రెండేసి వికెట్లు తీశారు. అజామ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మూడు టీ20ల సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు బుధ, గురువారాల్లో జరగనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+