Pakistan vs UAE: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్‌తో జరిగిన కీలక పోరులో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్.. ఇప్పుడు టోర్నమెంట్‌లో నిలబడేందుకు తీవ్రంగా పోరాడుతోంది. భారత్‌తో మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఐసీసీతో గొడవకు దిగింది. మ్యాచ్ రిఫరీని మార్చాలని డిమాండ్ చేసింది. ఒకవేళ తమ డిమాండ్లను ఐసీసీ పట్టించుకోకపోతే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని కూడా బెదిరించింది. అయితే ఐసీసీ పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించడంతో ఆ బెదిరింపులు గాలి మాటలయ్యాయి.
పాకిస్థాన్‌కు చావో రేవో?
ఆసియా కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్, యూఏఈ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. భారత్‌తో ఓడిన పాకిస్థాన్ జట్టుకు ఇది చావో రేవో లాంటి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-4లోకి అడుగుపెడుతుంది. ఇప్పటివరకు పాక్, యూఏఈ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. రెండు జట్లు ఒమన్‌ను ఓడించి రెండేసి పాయింట్లు సాధించాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్ లో మాత్రం రెండు జట్లు ఓటమిని చవిచూశాయి.

నేడు తేలనున్న పాకిస్థాన్ భవిష్యత్
టీమిండియాతో మొదటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం యూఏఈ జట్టు ఒమన్‌తో అద్భుత పోరాటపటిమను ప్రదర్శించింది. నేడు జరగబోయే మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైంది. యూఏఈ ఒమన్‌పై సాధించిన విజయం పాకిస్థాన్ జట్టుకు ఆందోళన కలిగించింది. ప్రస్తుతం ఇరు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన జట్టు 4 పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.
చిన్న జట్లతో పాకిస్థాన్‌కు చేదు అనుభవాలు
కీలక టోర్నమెంట్లలో చిన్న జట్ల చేతిలో ఓడిపోవడం పాకిస్థాన్ జట్టుకు కొత్తేమీ కాదు. 2007 వన్డే ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ చేతిలో, 2022 టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే చేతిలో, 2023 వన్డే ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్ చేతిలో, 2024 టీ20 ప్రపంచ కప్‌లో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఈ రికార్డు పాకిస్థాన్ జట్టును భయపెడుతోంది. నేటి మ్యాచ్‌లో యూఏఈ జట్టు పాకిస్థాన్‌కు మరో షాకిచ్చే అవకాశం ఉంది.