For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌లో ఆడితే చూడాలని ఉంది: కోహ్లీకి పాక్‌ అభిమాని విజ్ఞప్తి

Virat Kohli’s Fan Urges Him To Play In Pak, Twitter Reacts !
Pakistan vs Sri Lanka: Virat Kohlis Big Fan Urges Him To Play In Pakistan, Twitter Reacts

హైదరాబాద్: విరాట్ కోహ్లీ... మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ అనే క్రికెట్ అభిమాని కోహ్లీ మా దేశంలో క్రికెట్ ఆడితే చూడాలని ఉందంటూ ప్లకార్డుని ప్రదర్శించాడు.

దాసన్ షణక సారథ్యంలోని శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఆఖరి మ్యాచ్ లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ ప్రదర్శించిన ఓ ఫ్లకార్డు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.

"విరాట్ కోహ్లీ మీరు పాకిస్థాన్‌లో ఆడితే చూడాలని ఉంది" అని రాసి ఉన్న ప్లకార్డుని పట్టుకుని స్టేడియం మొత్తం కలియదిరిగాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. "విరాట్‌.. మీరు పాకిస్థాన్‌కు వచ్చి ఇక్కడ మ్యాచ్‌ ఆడతారని ఆశిస్తున్నా. నేను మీకు పెద్ద అభిమానిని" అనే కామెంట్‌తో ఆ ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌ను ఇప్పటికే అనేక మంది లైక్ చేయగా... పలువురు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు.

Story first published: Thursday, October 10, 2019, 14:06 [IST]
Other articles published on Oct 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+