10 ఏళ్ల తర్వాక పాక్‌లో వన్డే: పాక్-శ్రీలంక చరిత్రకు వరుణుడు అంతరాయం

హైదరాబాద్: 10 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే మ్యాచ్ వీక్షిద్దామనుకున్న పాక్ అభిమానులకు వరుణుడు అడ్డంకిగా మారాడు. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేకి వర్షం అడ్డుగా మారాడు. దీంతో టాస్ ఆలస్యమైంది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు.
గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గితే మ్యాచ్ నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. 2009లో శ్రీలంక జట్టుపై లాహోర్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్‌లో ఏ దేశం కూడా పర్యటించేందుకు ముందుకు రాని సంగతి తెలిసిందే. అయితే, ద్వైపాక్షిక సిరిస్‌లో శ్రీలంక జట్టుకు ముందుకు రావడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 9 వరకు
ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు అక్టోబర్ 9 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలి వన్డేకి ముందు కరాచిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు ప్రపంచ క్రికెట్ సహకరించాలని కోరాడు. రాబోయే రోజుల్లో పాక్‌లో క్రికెట్ ఆడేందుకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు రావాలని కోరాడు.

భద్రతాపరమైన అనుమానాలతో
భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్‌లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు దూరంగా ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో.. శ్రీలంక బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని అక్కడికి పంపించింది. జనవరి 2009 తర్వాత కరాచీ వేదికగా జరుగుతున్న మొట్టమొదటి వన్డే ఇదే కావడం విశేషం.
సంతృప్తి వ్యక్తం చేసిన తిరుమన్నే
మరోవైపు పాకిస్థాన్-శ్రీలంక జట్లు చివరగా అక్టోబర్, 2017లో జరిగిన వన్డేలో తలపడ్డాయి. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు తలపడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టుకు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై ఆ జట్టు కెప్టెన్ లాహిరు తిరుమన్నే సంతృప్తి వ్యక్తం చేశాడు.
భద్రత చాలా బాగుంది
ఈ సందర్భంగా లాహిరు తిరుమన్నే మాట్లాడుతూ "భద్రత చాలా బాగుంది. ఇది ఫస్ట్ క్లాస్ అని నేను తప్పక చెప్పాలి. మాకు ఎటువంటి సమస్యలు లేవు. పాకిస్థాన్‌లో మళ్ళీ క్రికెట్ ఆడటం సంతోషంగా ఉంది. కాబట్టి, భవిష్యత్తులో అన్ని జట్లను ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడటానికి ప్రోత్సహించాలి" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications