For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా రెండో సెంచరీ.. ఆబిద్‌ అలీ ఖాతాలో మరో రికార్డు!!

Pakistan vs Sri Lanka, 2nd Test: Abid Ali Becomes First Pakistan Player To Achieve Remarkable Feat

కరాచి: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. పాక్ ఓపెనర్లు షాన్‌ మసూద్‌ (198 బంతుల్లో 135; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబిద్‌ అలీ (281 బంతుల్లో 174; 21 ఫోర్లు, సిక్స్‌) సెంచరీలతో అదరగొట్టారు. మూడోరోజు ఆట ముగిసే సరికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 395 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ లోటును పూడ్చుకొంది.

అజహర్‌ అలీ సెంచరీ

అజహర్‌ అలీ సెంచరీ

ఓవర్‌నైట్‌ స్కోరు 57/0తో పాకిస్తాన్‌ శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించగా.. మసూద్‌, అబిద్‌ మొదటి వికెట్‌కు 278 పరుగులు జోడించి పటిష్ఠ స్థితిలో నిలిపారు. నాలుగో రోజు ఆటగాలో అజహర్‌ అలీ సెంచరీ (103 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) చేసాడు. మరోవైపు బాబర్‌ ఆజమ్‌ (56 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీ చేసాడు. ప్రస్తుతం పాక్ 398 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 191 పరుగులు చేయగా.. లంక 271 పరుగులు చేసింది.

తొలి పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌గా అబిద్‌ రికార్డు

తొలి పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌గా అబిద్‌ రికార్డు

32 ఏళ్ల లేటు వయసులో టెస్టుల్లో అడుగుపెట్టిన అబిద్‌ అలీ తాజా సెంచరీతో మరో రికార్డు సృష్టించాడు. ఆడిన తొలి వన్డే, టెస్ట్‌లో సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన అలీ.. ఆడిన మొదటి రెండు టెస్ట్‌ల్లో సెంచరీలు చేసిన తొలి పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో రావల్పిండిలో డ్రా అయిన మొదటి టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అబిద్‌ సెంచరీ (109) చేసిన సంగతి తెలిసిందే. గత మార్చిలో దుబాయ్‌లో ఆస్ట్రేలియాపై తన తొలి వన్డేలోనే సెంచరీ (112) చేసాడు.

రెండో అత్యుత్తమ భాగస్వామ్యం

రెండో అత్యుత్తమ భాగస్వామ్యం

అబిద్‌, మసూద్‌ పాక్ జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 278 పరుగులు జోడించారు. పాకిస్తాన్‌కు టెస్టుల్లో తొలి వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. అమీర్‌ సోహైల్‌-ఇజాజ్‌ అహ్మద్‌ (1997) జోడీ ఇదే మైదానంలో వెస్టిండీస్‌పై నెలకొల్పిన 298 పరుగుల భాగస్వామ్యం తొలి స్థానంలో ఉంది.

Story first published: Sunday, December 22, 2019, 12:08 [IST]
Other articles published on Dec 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+