ట్విట్టర్‌లో జోకులు: పాక్ అధ్యక్షుడి తరహాలో 42 ఆర్మీ వాహనాలతో శ్రీలంక ఆటగాళ్ల కాన్వాయ్ (వీడియో)

హైదరాబాద్: పాకిస్థాన్ గడ్డపై మ్యాచ్‌లు నిర్వహించాలనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కల ఎట్టకేలకు నెరవేరింది. పదేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై జరిగిన వన్డేలో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజామ్(115) సెంచరీతో రాణించడంతో పాక్ 67 పరుగులతో విజయం సాధించింది.
అయితే, సొంతగడ్డపై మ్యాచ్‌లు నిర్వహించేందుకు పాకిస్థాన్ గట్టి బందోబస్తునే ఏర్పాటు చేసింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటం కోసం పాక్ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లకు ఆ దేశ ప్రెసిడెంట్ తరహా సెక్యూరిటీని అందించారు. లంక ఆటగాళ్లను వారు బస చేస్తున్న హోటల్ నుంచి స్టేడియానికి తీసుకెళ్లేందుకు భారీ భద్రత కల్పించారు.
ఆ దేశ అధ్యక్షుడు రోడ్డుపై ప్రయాణిస్తుంటే
ఆ దేశ అధ్యక్షుడు రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఎలా ఉంటుందో ఆ తరహా భద్రతనే కల్పించారు. పాకిస్థాన్-శ్రీలంక ఆటగాళ్లు హోటల్ నుంచి బయల్దేరినప్పటి నుంచి స్టేడియానికి చేరుకునే వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపివేసి, జవాన్లను మోహరించారు. కాన్వాయ్‌లో 42 ఆర్మీ వాహనాలతో ఇరు జట్ల ఆటగాళ్లను స్టేడియానికి తరలించారు.
కాన్వాయ్ స్టేడియానికి వెళ్తోన్న దృశ్యాన్ని
నిజానికి ఈ తరహా భద్రత శ్రీలంక ఆటగాళ్లకు వారి దేశంలో కూడా లభించి ఉండకపోవచ్చు. శ్రీలంక ఆటగాళ్లతో కూడిన కాన్వాయ్ స్టేడియానికి వెళ్తోన్న దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆటగాళ్లకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పించిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు.
కరాచీలో కర్ఫ్యూ విధించి మ్యాచ్ ఆడినట్లు
మరోవైపు మ్యాచ్ మధ్యలో ఫ్లడ్‌లైట్లు సమస్య తలెత్తడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు సరిగ్గా వెలిగించేందుకు డబ్బులు లేవుగానీ మీకు కశ్మీర్ కావాలా? అని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. మరొక నెటిజన్ కరాచీలో కర్ఫ్యూ విధించి మ్యాచ్ ఆడినట్లు ఉందని కామెంట్ పోస్టు చేశాడు.

తొలి వన్డే రద్దు
కాగా, మూడు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే వర్షం కాగా రద్దు కాగా... సోమవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 67 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (115) సెంచరీ, ఫకర్ జమన్ (54) హాఫ్ సెంచరీతో రాణించారు.

రెండో వన్డేలో పాక్ విజయం
శ్రీలంక బౌలర్లలో హసరంగ డిసిల్వాకు 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 306 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్లలో షెహన్ జయసూర్య (96), షనక (68) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆరో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. పాక్ బౌలర్ షిన్వారి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ సిరిస్‌లో చివరిదైనా ఆఖరి వన్డే బుధవారం ఇక్కడే జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications