For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాపై విజయం.. 'సర్ఫరాజ్‌ వీ ఆర్‌ సారీ'

ICC Cricket World Cup 2019 : 'Sarfaraz We Are Sorry,' Pak Fans Apologise After Win Against SA
Pakistan vs South Africa: Sarfaraz Ahmed, We Are Sorry says Pakistan Fans

పాకిస్థాన్ అభిమానులు ఆ జట్టు కెప్టెన్‌కు క్షమాపణలు చెబుతున్నారు. వారం కిందట పాకిస్థాన్ జట్టును ఓ ఆటాడుకున్న అభిమానులను దక్షిణాఫ్రికాపై విజయం సాధించడంతో మనసు మార్చుకుని ఒకవైపు క్షమాపణలు చెబుతూ.. మరోవైపు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పాక్ అబిమానులు విజయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమయి ఘోర పరాభవం చవిచూసింది. ఆ తర్వాత టోర్నీ ఫేవరేట్, పటిష్ట ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. అనంతరం శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆస్ట్రేలియా చేతిలో మళ్లీ ఓడిపోయింది. దీంతో సీన్ మళ్లీ మొదటికి వచ్చింది.

ఇక చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై జయకేతనం ఎగురవేయాలన్న పాక్‌కు పరాభవమే ఎదురైంది. ఈ ఓటమితో పాకిస్థాన్ విమర్శలు ఎదుర్కొంది. అభిమానులు, మాజీ ఆటగాళ్లు పాక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభిమానులు అయితే అసభ్య పదజాలంతో దూషించారు. షికార్లు, భోజనం చేయడం తప్ప ఆట ఆడరాదు అని విమర్శించారు. పాకిస్థాన్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ కూడా సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ప్రపంచకప్‌ సెమీస్ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్‌ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో అప్పుడు విమర్శించిన పాక్‌ అభిమానులు క్షమాపణలు చెబుతున్నారు. మ్యాచ్ అనంతరం ఒక అభిమాని లార్డ్స్‌ మైదానంలోనే 'సర్ఫరాజ్‌ వీ ఆర్‌ సారీ' అనే పోస్టర్‌ ప్రదర్శించాడు. అనంతరం అభిమానులు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అయింది.

Story first published: Tuesday, June 25, 2019, 10:11 [IST]
Other articles published on Jun 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+