దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్‌ విజయం.. సెమీస్‌ రేసు నుంచి దక్షిణాఫ్రికా ఔట్‌

ICC Cricket World Cup 2019 : Pak Win By 49 Runs To Knock South Africa || Oneindia Telugu
Pakistan vs South Africa: Pakistan eliminate South Africa from semi-finals race with 49-run win

భారత్‌ చేతిలో దారుణ ఓటమి తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌ కీలక మ్యాచ్‌లో అద్భుత ఆటతో అదరగొట్టింది. సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ముందుగా బ్యాట్స్‌మెన్, తర్వాత బౌలర్లు సమష్టిగా కదం తొక్కడంతో దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ఆదివారం జరిగిన పోరులో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక టోర్నీలో ఐదో ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. అఫ్గానిస్థాన్‌ తర్వాత సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన జట్టు దక్షిణాఫ్రికానే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆరంభంలోనే షాక్:

ఆరంభంలోనే షాక్:

309 పరుగుల భారీ ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ ఆమ్లా (2) రెండో ఓవర్లోనే ఔటైనా.. మరో ఓపెనర్‌ డికాక్‌ (47; 60 బంతుల్లో 3×4, 2×6), డుప్లెసిస్‌ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా కోలుకుంది. ఈ సమయంలో షాదాబ్‌ ఖాన్‌ దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. డికాక్‌ను ఔట్‌ చేసిన కాసేపటికే మార్‌క్రమ్‌ (7)ను బౌల్డ్‌ చేశాడు.

డుప్లెసిస్‌ హాఫ్ సెంచరీ:

డుప్లెసిస్‌ హాఫ్ సెంచరీ:

ఇక క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ డుప్లెసిస్‌ (63; 79 బంతుల్లో 5×4)ను 30వ ఓవర్లో ఆమిర్‌ ఔట్‌ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లోపడింది. పాక్‌ పేలవ ఫీల్డింగ్‌ను సొమ్ము చేసుకుంటూ వాన్‌డర్‌ డుస్సెన్‌ (36; 47 బంతుల్లో 1×4, 1×6), మిల్లర్‌ (31; 37 బంతుల్లో 3×4) ఐదో వికెట్‌కు 53 రన్స్‌ జోడించారు. మరోవైపు సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరుగుతూ పోయింది. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా గెలిచేలా కనపడలేదు.

ఫెలుక్వాయో మెరుపు మెరిపించినా:

ఫెలుక్వాయో మెరుపు మెరిపించినా:

40వ ఓవర్లో ప్రొటీస్ స్కోరు 189 వద్ద డుస్సెన్‌ను షాదాబ్‌, తర్వాతి ఓవర్లో మిల్లర్‌ను షహీన్‌ అఫ్రిది ఔట్‌ చేయడంతో ఆ జట్టులో ఉన్న ఆశలు కాస్తా ఆవిరయ్యాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓటమి లాంఛనమే అనిపించింది. చివరలో ఫెలుక్వాయో (46 నాటౌట్‌; 32 బంతుల్లో 6×4) బ్యాట్‌ ఝుళిపించినా కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించాడు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. రియాజ్‌, షాదాబ్‌ తలో మూడు వికెట్లు తీశారు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' హరిస్‌ సొహైల్‌కు దక్కింది.

ఓపెనర్ల శుభారంభం:

ఓపెనర్ల శుభారంభం:

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. పాక్‌కు ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (58 బంతుల్లో 44; 6 ఫోర్లు), ఫఖర్‌ జమాన్‌ (50 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. కుదురుగా ఆడుతున్న ఓపెనర్లను ఇమ్రాన్‌ తాహిర్‌ ఔట్‌ చేశాడు. తర్వాత బాబర్‌ ఆజమ్ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు), హఫీజ్‌ (20)లు కూడా బాధ్యతగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది.

సొహైల్‌ మెరుపులు:

సొహైల్‌ మెరుపులు:

ఈ సమయంలో హఫీజ్‌ వెనుదిరిగాక వచ్చిన హరిస్‌ సొహైల్‌ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఆజమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో బాబర్‌ 61 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 224 పరుగుల వద్ద బాబర్‌ నిష్క్రమించాడు. అయితే సొహైల్‌.. ఇమాద్‌ వసీమ్‌ (23; 3 ఫోర్లు) కలిసి ఐదో ధాటిగా ఆడుతూ 38 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అనంతరం మరింత రెచ్చిపోయి భారీ స్కోర్ అందించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 24, 2019, 7:39 [IST]
Other articles published on Jun 24, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more