
పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ హరీస్ సొహైల్ అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సొహైల్ (89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన సొహైల్ బ్యాట్ జులిపించడంతో పాకిస్తాన్ 309 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సొహైల్ ఆది నుంచి విజృంభించి ఆడాడు. అతడు 50కి పైగా పరుగుల్ని ఫోర్లు, సిక్సర్లతోనే సాధించాడు. హాఫ్ సెంచరీ చేసే క్రమంలో సొహైల్ స్టైక్‌రేట్ 150.84గా ఉంది. దీంతో పాక్ దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో యాభైకి పైగా వ్యక్తిగత పరుగులు సాధించే క్రమంలో అత్యధిక స్టైక్‌రేట్ నమోదు చేసిన మూడో పాక్ క్రికెటర్‌గా సొహైల్ గుర్తింపు పొందాడు.
అత్యధిక స్టైక్‌రేట్ నమోదు చేసిన పాక్ ఆటగాళ్లలో ఇమ్రాన్ ఖాన్ 169. 69స్టైక్ రేట్ (1983, శ్రీలంకపై 33 బంతుల్లో 56 పరుగులు), ఇంజమాముల్ హక్ 162. 16 (1992, 37 బంతుల్లో 60)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో వైపు ఈ మ్యాచులో సొహైల్ తన 'జెర్సీ నెంబర్-89' పరుగులే చేయడం విశేషం.
309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఓపెనర్ ఆమ్లా (3) త్వరగానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (47; 60బంతుల్లో 3×4, 2×6), కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ నిర్మించారు. 20వ ఓవర్ వేసిన షెదాబ్ బౌలింగ్‌లో డికాక్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. 24వ ఓవర్‌లో షెదాబ్ మార్క్రమ్ (7)ను బౌల్డ్ చేశాడు.
దీంతో 103 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రమంలో డుప్లెసిస్ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 28 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. డుప్లెసిస్ (60), డసెన్ (14) క్రీజులో ఉన్నారు. విజయం సాధించాలంటే సౌతాఫ్రికా ఇంకా 178 పరుగులు చేయాలి.
{headtohead_cricket_5_6}