న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd T20: విజయంతో సఫారీ పర్యటన ముగించిన పాక్

Pakistan vs South Africa 3rd T20: Pakistan win final T20 against South Africa by 27 runs

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను కోల్పోయిన పాకిస్థాన్‌ జట్టుకు ఆఖరి టీ20లో విజయం కాస్త ఊరటనిచ్చింది. సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనను పాకిస్థాన్‌ విజయంతో ముగించింది. మూడు టీ20ల సిరిస్‌లో తొలి రెండు టీ20లను సపారీలు సొంతం చేసుకోవడంతో సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టులో మహ్మద్‌ రిజ్వాన్‌ (26), ఆసిఫ్‌ అలీ (25), బాబర్‌ అజామ్‌ (23) రాణించడంతో మొదట పాకిస్థాన్‌ 9 వికెట్లకు 168 పరుగులు చేసింది. సఫారీ జట్టులో బ్యూరాన్‌ హెం డ్రిక్స్‌ (4/14) అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

141 పరుగులు చేసి ఓడిన సఫారీలు

141 పరుగులు చేసి ఓడిన సఫారీలు

అనంతరం దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసి ఓడిపోయింది. సఫారీ జట్టులో క్రిస్‌ మోరిస్‌ (29 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, వాన్‌ డర్‌ డసెన్‌ (35 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించాడు.

డేవిడ్‌ మిల్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు

డేవిడ్‌ మిల్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు

పాక్ బౌలర్లలో ఆమిర్‌ 3 వికెట్లు పడగొట్టగా... షాదాబ్‌, అష్రఫ్‌ చెరో 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో చివరి ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాదడంతో పాటు 2 కీలక వికెట్లు తీసిన షాదాబ్‌ ఖాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కగా, డేవిడ్‌ మిల్లర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా ఎంపికయ్యాడు.

Story first published: Friday, February 8, 2019, 12:51 [IST]
Other articles published on Feb 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X