పూర్ డెలివరీ: బౌలర్‌పై సహనం కోల్పోయిన పాక్ కెప్టెన్ (వీడియో)

హైదరాబాద్: అబుదాబి వేదికగా పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహనం కోల్పోయాడు. జట్టులోని సహచర బౌలర్‌పై తన ఆవేశాన్ని వెళ్లగక్కాడు. ఫీల్డింగ్ సెట్ చేసిన ప్రకారం బౌలింగ్ వేయమని స్పిన్నర్ బిలాల్ అసిఫ్‌పై కోప్పడ్డాడు.

153 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ జట్టు తరుపున కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టెయిలెండర్ ట్రెంట్ బౌల్ట్ క్రీజ్‌లో ఉన్నప్పుడు బిలాల్ బౌలింగ్ వేస్తున్నాడు.
బిలాల్ కోరినట్లు ఫీల్డింగ్ సెట్ చేసిన సర్ఫరాజ్
ఈ సందర్భంగా బౌల్ట్‌ను పెవిలియన్‌కు చేర్చేందుకు బిలాల్ కోరినట్లు ఫీల్డింగ్ సెట్ చేశాడు సర్ఫరాజ్. బిలాల్ బ్యాట్స్‌మన్‌కు ఓ లెంగ్త్ బాల్ విసిరాడు. ఆ బంతికి ముందుకొచ్చీ మరీ ఫోర్ బాదాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సర్పరాజ్ ‘నువ్వు ఏమి చెప్పావ్.. ఎలా బౌలింగ్ వేశావ్' అంటూ బిలాల్‌పై కోప్పడ్డాడు.

చిన్నబోయిన బిలాల్ ఆసిఫ్
దాంతో బిలాల్ ముఖం ఒక్కసారిగా చిన్నబోయాడు. ఈ ఘటన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 66 ఓవర్‌లో చోటు చేసుకుంది. ఆ తర్వాత, ఆ మరుసటి ఓవర్‌లో అజాజ్ పటేల్ చివరి వికెట్‌గా వికెట్‌గా ఔటయ్యాడు. ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది.

పాక్ విజయ లక్ష్యం 176 పరుగులు
అనంతరం పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజాం(62) పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక, న‍్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. దీంతో పాక్‌కు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications