రెచ్చిపోయిన యాసిర్ షా.. కివీస్ 14 వికెట్లను చిత్తుగా!!

హైదరాబాద్: ఒక్కడే.. తానొక్కడై 14వికెట్లను పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు యాసిర్ షా. దీంతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలుపొందింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో హారిస్ సొహైల్(147), బాబర్ ఆజామ్(127 నాటౌట్) సెంచరీలతో 418/5 వద్ద డిక్లేర్ చేసిన పాక్.. అనంతరం కివీస్‌ను 90 పరుగులకే కుప్పకూలింది.

యాసిర్ షా దెబ్బకు తాళలేక
ఓ దశలో 50/0తో పటిష్టంగా కనిపించిన కివీస్.. యాసిర్ షా దెబ్బకు తాళలేకపోయింది. షా 8 వికెట్లు తీయడంతో 40 పరుగుల వ్యవధిలోనే 10 వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం ఉండటంతో.. కివీస్‌ను పాక్ ఫాలోఆన్ ఆడించింది. ఓవర్‌నైట్ స్కోరు 24/0తో ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ దశలో యాసిర్ షా మాయాజాలం ఊపందుకుంది.

క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్
ఓపెనర్ జీత్ రావల్ వికెట్‌తో మొదలుపెట్టిన యాసిర్.. క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌నూ కుదురుకోనివ్వలేదు. దీంతో కివీస్ 50-0 నుంచి 90కే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ విలియమ్సన్(28 నాటౌట్), ఓపెనర్లు జీత్ రావల్(31), టామ్ లాథమ్(22) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కివీస్ జట్టులో ఏకంగా ఆరుగురు డకౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన యాసిర్ షా రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు.

కివీస్ 312 పరుగులకే ఆలౌటయి
44.5 ఓవర్లు బౌలింగ్ చేసిన షా.. 143 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో కివీస్ 312 పరుగులకే ఆలౌటయ్యింది. టామ్ లాథమ్ (158 బంతుల్లో 50), రాస్ టేలర్ (128 బంతుల్లో 82), హెన్రీ నికోల్స్ (187 బంతుల్లో 77) ప్రతిఘటించినప్పటికీ.. షా మ్యాజిక్ ముందు కివీస్ మోకరిల్లింది.

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా యాసిర్ షా
పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన యాసిర్ షా (14/184) 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. 14 వికెట్లు పడగొట్టడం ద్వారా పాకిస్థాన్ తరఫున ఓ టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇమ్రాన్ ఖాన్‌తో పాటుగా నిలిచాడు. టెస్టుల్లో హిర్వాణి (16/136), కుంబ్లే (14/149) తర్వాత అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన మూడో లెగ్ స్పిన్నర్‌గా షా రికార్డులకెక్కాడు. 15 ఏళ్ల తర్వాత ఓ బౌలర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications