బౌలర్ బట్టతలపై బంతిని రుద్దిన జో రూట్.. ఒరెయ్ ఏంట్రా ఇది!(Video)
ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంతి షైన్ చేయడం కోసం జో రూట్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. స్పిన్నర్ జాక్ లీచ్ బట్టతలపై రూట్ బంతిని రుద్దాడు. ఫన్నీగా జో రూట్ చేసిన ఈ పనిని బ్రాడకాస్టర్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'బంతి షైన్ కోసం జో రూట్ కొత్త విధానాలు కనిపెడుతున్నాడు' అని దానికి క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసేసరికి పాకిస్థాన్ అయిదు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ కమ్రాన్ గుహ్లామ్ (118; 224 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ సయిమ్ అయుబ్ (77; 160 బంతుల్లో, 7 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. జాక్ లీచ్ రెండు వికెట్లు, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్సె, మాథ్యూ పాట్స్, షోయబ్ బసీర్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫికీ (7; 28 బంతుల్లో, 1 ఫోర్), కెప్టెన్ షాన్ మసూద్ (3; 7 బంతుల్లో) 19 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కమ్రాన్‌తో కలిసి సయిమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 147 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు పడగొట్టారు. సయిమ్, సౌద్ షకీల్ (4; 14 బంతుల్లో, 1 ఫోర్) పది పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. మరో ఎండ్‌లో ఉన్న కమ్రాన్ నిలకడగా పరుగులు సాధిస్తూ శతకం సాధించారు. అయితే సెంచరీ చేసిన కాసేపటికే ఔటయ్యాడు. మహ్మద్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 89 బంతుల్లో, 4 ఫోర్లు), అఘూ సల్మాన్ (5 బ్యాటింగ్; 19 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
Joe Root finding the best ways to shine the ball 🤣 pic.twitter.com/nUnI58voVI
— Sky Sports Cricket (@SkyCricket) October 15, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications