
హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో అబుబాది వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 12 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 63/3తో నిలిచింది.
జునైద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఐదో బంతిని ఆడబోయి ఓపెనర్ సౌమ్య సర్కార్ (0) ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి మొమినల్ (5) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జునైద్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి లిటన్ దాస్ (6) బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో మహ్మద్ మిథున్(16), ముష్ఫికర్ రహీమ్(34) పరుగులతో ఉన్నారు. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది.
ఈ రెండు జట్లు సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.