Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Usman Khawaja: ఉస్మాన్ భాయ్‌తో గేమ్స్ వద్దు.. పాక్ జట్టుకు కొత్త కష్టం..!

చాలా మంది ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లు ఆయా దేశం తరపున ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకపోవడంతో పక్క దేశాలకు వెళ్లి ఆ దేశం తరపున క్రికెట్ ఆడుతున్నారు.అయితే వీరు ప్రత్యర్థి జట్టుకు చాలా ప్రమాదకరంగా మారుతున్నారు. వారు ఒక దేశం తరపున ఆడుతుంటే ప్రత్యర్థి జట్టుకు ఎలా డేంజర్‌‌గా మారుతున్నారనే అనుమానం వస్తుంది కదూ.. అవును. ఎలా ప్రత్యర్థుల వ్యూహాలపై దెబ్బకొడుతున్నారో వారి స్ట్రాటజీని ఎలా పసిగట్టుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

భారత్, పాకిస్తాన్‌లలో పుట్టి పెరిగిన చాలామంది ఇక్కడ అవకాశాలు దొరక్క పక్క దేశాల తరపున క్రికెట్ ఆడుతున్నారు. ఉదాహరణకు భారత్‌లో పుట్టిన తేజ నిడమనూరు, రచిన్ రవీంద్రలాంటి వారైతే.. పాకిస్తాన్‌లో పుట్టి పెరిగిన ఉస్మాన్ ఖవాజా కూడా ఈ జాబితాలోకే వస్తాడు.

Pakistan vs Australia:Usman Khawajas Urdu Mastery A Silent Disruptor in the Ranks of the Pak Cricket Team

పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగితే చాలు ఉస్మాన్ చాలా డేంజరస్‌గా మారుతున్నాడు. అంటే ఆటపరంగా కాదు. పాకిస్తాన్ వ్యూహం అమలు చేసే భాగంలో వారు చర్చించుకుంటున్నది లేదా గ్రౌండ్‌లో ప్లేయర్లు ఉర్దూలో మాట్లాడుకుంటున్నది ఉస్మాన్ పసిగట్టేస్తున్నాడు. వీరి స్ట్రాటజీని ఆసీస్‌కు లీక్ చేసి పాక్ వ్యూహాలకు బ్రేక్ వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఈ విషయాన్ని గ్రహించిన పాకిస్తాన్ జట్టు ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉర్దూ మాట్లాడకూడదని డిసైడ్ అయ్యిందట. ఉస్మాన్ పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో పుట్టి పెరిగాడు. ఉస్మాన్‌కు ఉర్దూ బాగా తెలియడంతో పాక్ పప్పులు ఉడకడం లేదు. 2023 ప్రథమార్థంలో జరిగిన పాకిస్తాన్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో పాక్ క్రికెటర్లు ఉర్దూలో మాట్లాడుకుంటూ రహస్యంగా వేసుకున్న స్కెచ్‌ను ఉస్మాన్ పసిగట్టి లీక్ చేశాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటామని ఉస్మాన్ క్రీజులో ఉన్న సమయంలో ఉర్దూ మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని పాక్ జట్టు సభ్యులు చెబుతున్నారు.

Pakistan vs Australia:Usman Khawajas Urdu Mastery A Silent Disruptor in the Ranks of the Pak Cricket Team

కరాచీలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఉస్మాన్ తమ స్ట్రాటజీని లీక్ చేశాడని, ఈసారి అలా జరగనివ్వమని వ్యూహం గురించి ఉర్దూలో మాట్లాడే ప్రసక్తే ఉండదని పాకిస్తాన్ జట్టు చెబుతోంది.ఒకవేళ ఆ సమయంలో నిజంగా స్ట్రాటజీ గురించి చర్చించుకోవాలంటే ఉస్మాన్‌కు దూరంగా వెళ్లి అక్కడ వ్యూహం గురించి చర్చిస్తామని చెబుతోంది జట్టు మేనేజ్‌మెంట్.

డిసెంబర్ 14వ తేదీ నుంచి ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోని కాన్‌బెరాకు చేరుకున్న పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్‌తో 4 రోజుల ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

Story first published: Saturday, December 2, 2023, 13:36 [IST]
Other articles published on Dec 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+