Pak vs Aus: బచ్చగాడివి నువ్వు.. నన్నేందిరా స్లెడ్జింగ్ చేసేది.. నవ్వుతూనే పాక్ పేసర్‌కు వార్నర్ కౌంటర్

రావల్పిడి: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్, నసీమ్ షా మధ్య ఈ ఘటన జరిగింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
చిరునవ్వుతో సమాధానం
అసలు ఏం జరిగిందటే.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ మంచి స్కోర్‌తో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా, వార్నర్ శరీరానికి తాకేలా షాట్ పిచ్ బంతులు వేశాడు. దీంతో ఆ బంతులు వార్నర్ చేతులకు, భుజానికి తాకాయి. అంతేకాకుండా వార్నర్‌ను స్లెడ్జింగ్ కూడా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ విషయాన్ని 35 ఏళ్ల డేవిడ్ వార్నర్ చాలా తేలికగా తీసుకున్నాడు. నసీమ్ షాతో ఎటువంటి వాగ్వాదానికి దిగకపోగా నవ్వుతూ ఉన్నాడు. అలాగే నవ్వుతూనే నసీమ్ షా భుజం తట్టి అభినందించాడు. వార్నర్ ఇలా కూల్‌గా ఉంటూ స్లెడ్జింగ్ ప్రయత్నాలను చిరునవ్వుతూ ఆపేయడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలా నసీమ్ స్లెడ్జింగ్‌కు వార్నర్ చిరు నవ్వుతో సమాధానం ఇచ్చాడు.

వార్నర్‌పై ప్రశంసలు
ఈ క్రమంలో వార్నర్ ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో దూకుడుతో ప్రత్యర్థి ఆటగాళ్లపై స్టెడ్జింగ్‌కు పాల్పడిన వార్నర్‌లో ఇంతలో ఎంత మార్పు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతో వార్నర్‌లా ఉండండి అంటూ పాకిస్థాన్ ఆటగాళ్లకు బుద్ది చెబుతున్నారు. ఇంకొందరు పర్యాటక జట్టు ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోండని సూచిస్తున్నారు. అలాగే ఇసున తుఫాన్ వంటి వార్నర్ ముందు ఇలాంటి సంఘటనలు సరికాదని, అతని దూకుడు మీకు తెలియదంటూ పాక్ ప్లేయర్లను హెచ్చరిస్తున్నారు. అలాగే బచ్చగాడివి నువ్వు నన్నేందిరా స్లెడ్జింగ్ చేసేది అని వార్నర్ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడని రాసుకొస్తున్నారు.

ధీటుగా బదిలిస్తున్న ఆసీస్
ఇక టెస్టు మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో అజర్ అలీ (185), ఇమామ్-ఉల్-హక్ (157) భారీ సెంచరీలతో చెలరేగారు. ఆస్ట్రేలియా కూడా పాకిస్థాన్‌కు ధీటైన సమాధానం ఇస్తుంది. ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 449 పరుగులు చేసింది. మరో 27 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా (97), మార్న్‌స్ లబుషేన్ (90), స్టీవెన్ స్మిత్ (78), కామెరూన్ గ్రీన్ (48) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications