Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టుల్లో 12వ సెంచరీ: ఆసీస్ వ్యూహానికి అలీ అడ్డుకట్ట

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పట్టు బిగుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తొలిరోజైన సోమవారం పదే పదే వర్షం పడటంతో 50.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.

ఇక రెండో రోజైన మంగళవారం 142/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన పాకిస్థాన్ ఓపెనర్ అజహర్ అలీ 287 బంతుల్లో 12 ఫోర్లతో 139 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో అజహర్ అలీకి ఇది 12వ సెంచరీ కావడం విశేషం. పాకిస్థాన్‌ను ఆలౌట్‌ చేయాలనే ఆసీస్ వ్యూహాన్ని సెంచరీ వీరుడు అలీ అడ్డుకున్నాడు.

 Pakistan Vs Australia: Azhar Ali slams career's 12th ton amid rain in second Test

మరోవైపు అలీకి తోడు అసద్‌ 123 బంతుల్లో నాలుగు ఫోర్లతో అర్ధసెంచరీని నమోదు చేశాడు. దీంతో రెండో టెస్టు రెండో రోజు ఐదో వికెట్‌కు వీరిద్దరి జోడీ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక మంగళవారం ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ 310 పరుగులు చేసిన పటిష్ట స్థితికి చేరుకుంది.

ప్రస్తుతం క్రీజులో సెంచరీ వీరుడు అజహర్‌ అలీకి తోడు మహ్మద్‌ అమీర్‌ (28 నాటౌట్‌)గా ఉన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో పాక్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించిన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+