Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టాన్ లేక్ అద్భుత ప్రదర్శన, పాక్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Pakistan vs Australia, 2nd T20I: Australia win by 9 wickets

హైదరాబాద్: వరుసగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరాజయం తర్వాత ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు గెలుపు దక్కింది. ప్రపంచ నెంబర్‌వన్‌ పాకిస్థాన్‌తో జరిగిన ముక్కోణపు టీ20లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆసీస్‌ పేసర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌, ఆండ్రూ టై (3/38) రికార్డుస్థాయి ప్రదర్శనతో చెలరేగి.. పాక్‌ 19.5 ఓవర్లలో 116 రన్స్‌కే పరిమితం చేశారు. నాలుగు ఓవర్ల స్పెల్‌ (4-0-8-4)లో ఓవర్‌కు ఓ వికెట్‌ చొప్పున పడగొట్టిన స్టాన్‌లేక్‌ పాక్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు.

ఛేదనలో షాదాబ్‌ఖాన్‌ (29) టాప్‌ స్కోరర్‌. ఫించ్‌ (68 నాటౌట్‌) చెలరేగడంతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 10.5 ఓవర్లలో తొమ్మిది వికెట్ల తేడాతో ఛేదించింది. ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్‌ 10.5 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది.

పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టాన్‌లేక్‌ ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. షాదాబ్‌ ఖాన్‌ (29) టాప్‌ స్కోరర్‌. ఫించ్‌ (33 బంతుల్లో 68 నాటౌట్‌) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు.

ఈ మ్యాచ్‌ ద్వారా పాక్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి పురుష క్రికెటర్‌గా నిలిచాడు.

పాకిస్థాన్, ఆస్ట్రేలియాలు తర్వాతి టీ20 మ్యాచ్‌ను జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం వేదికగా గురువారం తలపడనున్నాయి. ఈ రెండింటికి ఇది రెండో టీ20.

Story first published: Tuesday, July 3, 2018, 10:43 [IST]
Other articles published on Jul 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+