న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచిన ఆప్ఘన్ బ్యాటింగ్: సెమీస్‌కు చేరాలంటే పాకిస్థాన్ గెలవాల్సిందే!

 Pakistan vs Afghanistan, World Cup 2019 LIVE: Afghanistan win toss, elect to bat

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నాం 3 గంటలకు పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అప్ఘన్‌ కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆప్ఘన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓడి ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.

కనీసం పరువు నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. మరోవైపు నాకౌట్‌కు చేరాలంటే పాక్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. ఈ నేపథ్యంలో అప్ఘనిస్థాన్‌పై ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఉత్సాహంతో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఆప్ఘన్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి మరి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు వన్డేలు జరగ్గా అన్నింట్లోనూ పాకిస్తానే గెలిచింది. ప్రపంచ కప్‌లో తలపడటం మాత్రం ఇదే మొదటిసారి.

జట్ల వివరాలు:

1
43679

పాకిస్థాన్‌: ఇమాముల్‌ హక్‌, ఫకర్‌ జమాన్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ హఫీజ్‌, హారిస్‌ సోహైల్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), ఇమాద్‌ వసీం, షాబాద్‌ఖాన్‌, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ ఆమిర్‌, షాహిన్‌ అఫ్రిది

అఫ్గానిస్థాన్‌: గుల్బాడిన్‌ నైబ్‌(కెప్టెన్‌), రహ్మత్‌షా, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గాన్‌, మహ్మద్‌ నబీ, సైముల్లా సిన్‌వారి, నజీబుల్లా జద్రాన్‌, ఇక్రమ్‌ అలి ఖిల్‌, రషీద్‌ఖాన్‌, హమిద్‌ హసన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌

Story first published: Saturday, June 29, 2019, 16:34 [IST]
Other articles published on Jun 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X