చివరి ఓవర్ వరకు ఉత్కంఠ: ఆప్ఘన్‌పై పాక్‌ను గెలిపించిన షోయబ్


హైదరాబాద్: ఆసియాకప్‌లో భాగంగా అప్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస విజయాలతో గ్రూప్-బిలో టాపర్‌గా నిలిచిన అప్ఘనిస్తాన్ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఎదుట నిలువలేకపోయింది. షోయబ్ మాలిక్ హాఫ్ సెంచరీ(51)తో రాణించి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అత్యుత్తమ బౌలింగ్‌ను కలిగి ఉన్న పాకిస్థాన్ జట్టు ఆప్ఘన్ మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గట్లే విజృంభించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ వరుస ఓవర్లలో ఓపెనర్లు షహజాద్ (20), ఎహ్‌సానుల్లా (10)లను పెవిలియన్ పంపాడు.

మూడో వికెట్‌కు 63 పరుగులు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహమత్ షా (36)తో కలిసి హష్మతుల్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరి జోడీ మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించాక నవాజ్ బౌలింగ్‌లోనే రహమత్ షా వెనుదిరిగాడు. అనంతరం హష్మతుల్లాతో జత కలిసిన కెప్టెన్ అస్గర్ ముందు ఆచితూచి ఆడినప్పటికీ, కుదురుకున్నాక భారీ సిక్సర్లతో హోరెత్తించాడు.

నాలుగో వికెట్‌కు 99 బంతుల్లో 94 పరుగులు
వీరిద్దరి జోడీ నాలుగో వికెట్‌కు 99 బంతుల్లో 94 పరుగులు జతచేశారు. ఆ తర్వాత ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు హష్మతుల్లా చివరి వరకు నిలిచి జట్టుకు చక్కటి స్కోరు అందించాడు. చివరి 10 ఓవర్లలో అప్ఘనిస్థాన్ జట్టు 87 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 3, అరంగేట్ర పేసర్ షాహీన్ ఆఫ్రిది 2 వికెట్లు పడగొట్టారు.

49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన పాక్
ఆ తర్వాత 258 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్(80), బాబర్ అజామ్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 154 పరుగులు జోడించారు. స్కోరు వేగం పెంచే క్రమంలో ఇమామ్ రనౌట్‌గా వెనుదిరగ్గా... బాబర్‌ను రషీద్ పెవిలియన్‌కు చేర్చాడు.

పాక్ విజయంలో షోయబ్ మాలిక్ కీలకపాత్ర
అయితే వీరిద్దరు ఔటయ్యాక పాక్ కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఆ తర్వాత సోహైల్ (13), సర్ఫరాజ్ (8), నవాజ్ (10) ఔటైనా షోయబ్ మాలిక్ (51 నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆప్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్(3), ముజీబ్ ఉర్ రహ్మన్(2), గుల్‌బదిన్ నయబ్ ఒక వికెట్ తీశాడు. షోయబ్ మాలిక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications