Mohammad Hafeez: అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ దిగ్గజం గుడ్‌బై

పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న హఫీజ్ తాజాగా టీ20ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు హఫీజ్ వీడ్కోలు పలికాడు. 41 ఏళ్ల ఈ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ 2020 టీ వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఆ వరల్డ్‌కప్ 2021కి వాయిదా పడడంతో ఇన్ని రోజులు ఆడాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో హఫీజ్ ఆడిన సంగతి తెలిసిందే. హఫీజ్ 2018లో టెస్టు క్రికెట్ నుంచి, 2019లో వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా హఫీజ్ పాక్ జట్టుకు సేవల అందించాడు.

హఫీజ్ టెస్టు రికార్డులు
హఫీజ్ 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2003 ఆగస్టు 20న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో హఫీజ్ కెరీర్ ప్రారంభమైంది. 2018లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న హఫీజ్.. డిసెంబర్ 3న న్యూజిలాండ్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంగా తన కెరీర్‌లో 55 టెస్టు మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 37 సగటుతో 3652 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకసారి డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 224. అంతేకాకుండా 54 వికెట్లు కూడా పడగొట్టాడు. అత్యుత్తుమ బౌలింగ్ 4-16.

హఫీజ్ వన్డే రికార్డులు
2003 ఏఫ్రిల్ 3న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో హఫీజ్ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. కెరీర్‌లో తన చివరి వన్డే మ్యాచ్‌ను 2019 వరల్డ్‌కప్‌లో జూలై 19న బంగ్లాదేశ్‌తో ఆడాడు. కెరీర్‌లో మొత్తంగా 218 వన్డే మ్యాచ్‌లు ఆడి 32 సగటుతో 6614 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 140. అలాగే 139 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ 4-41.

హఫీజ్ టీ20 రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్‌లో 119 టీ20 మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 26 సగటుతో 2514 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 99 పరుగులు. అదే సమయంలో 61 వికెట్లు కూడా పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ 4-10. కెరీర్‌లో తన తొలి టీ20ని 2006 ఆగస్టు 28న ఇంగ్లండ్‌తో ఆడాడు. చివరి టీ20 మ్యాచ్‌ను 2021 నవంబర్ 11న ఆస్ట్రేలియాతో ఆడాడు.

హఫీజ్ కెప్టెన్సీ రికార్డులు
హఫీజ్ పాకిస్థాన్‌కు జట్టుకు పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మొత్తంగా 29 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా 18 మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించింది. 2017లో ఆస్ట్రేలియాతో రెండు వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. ఒక దాంట్లో గెలిచి, ఒక దాంట్లో ఓడిపోయాడు. 2012లో శ్రీలంకతో జరిగిన గాలె టెస్టు మ్యాచ్‌లో నాయకత్వం వహించగా.. ఆ మ్యాచ్‌లో పాక్ 209 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications