న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లు ఎలా గెలవాలో భారత్‌కు బాగా తెలుసునని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ అన్నాడు. ఈ నెల 15వ తేదీన జరగనున్న మ్యాచులో పాకిస్తాన్ గెలవదని కొట్టిపారేయలేమని, అయితే ఫేవరేట్ మాత్రం భారత్ అన్నాడు.

ఆస్ట్రేలియాలో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ భారత్‌కు మద్దతుగా నిలబడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనీ సేనకు టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అతను అభిప్రాయపడ్డాడు.
ప్రపంచ కప్‌లో క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు అన్నీ చాలా కీలకమని చెప్పాడు. భారత్ నాకౌట్ దశకు చేరుతుందని చెప్పాడు. ఆ తర్వాత ఎలా కప్పును ఎలా గెలవాలో భారత్‌కు తెలుసునని చెప్పాడు. 2011లో ప్రపంచ కప్‌లో భారత్ గెలవడంలో గ్యారీ కిర్‌స్టన్ పాత్ర కూడా కీలమైంది. అప్పుడు అతను టీమిండియా కోచ్‌గా ఉన్నాడు.