For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: పాకిస్థానీ ఆటగాళ్లపై చేతబడి చేయించారు.. పాక్ టీవీ ఛానల్స్ ఏం చెబుతున్నాయో చూడండి!

IND vs PAK: పాకిస్థాన్ లో ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదు. టీమిండియా పాకిస్థాన్ ను ఓడించడానికి కారణం భారత్ కు చెందిన పండితులు చేతబడి చేయడమేనని పాక్ టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నట్లు తెలిసింది. 'ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్ ఫినాలేలో టీమిండియా విజయం సాధిస్తుందని 22 మంది పండితులు అంచనా వేశారు. ఈ 22 మంది పండితులను బీసీసీఐ నియమించింది. టీమిండియా స్టేడియానికి చేరుకునే ముందు 7గురు పండితులు చేతబడి చేయడం ప్రారంభిస్తారు.అనంతరం 22 మంది పండితులు కలి పాకిస్థానీ ఆటగాళ్లపై చేతబడి చేసి వాళ్ల దృష్టిని మరల్చి భారత జట్టును గెలిపించారు.'.. ఇది ఎవరో చెప్పింది కాదు.. పాకిస్థాన్ వార్తా ఛానెలలో ప్రసారం చేయబడింది.

పాకిస్థానీ వార్తా ఛానెల్ డిస్కవర్ పాకిస్థాన్ టీవీలో.. ఆరుగుల వ్యక్తుల ప్యానెల్ చర్చలో భారత్ ,పాక్ మ్యాచ్ గురించి చర్చించారు. టీవీలో మాట్లాడుతూ.. భారత్ 22 మంది పండితులను నియమించుకుందని.. వారు భారత్ విజయం కోసం పాకిస్థాన్ జట్టుపై చేతబడి చేస్తున్నారని ఆ ఆరుగురిలో ఒకరు మాట్లాడడం గమనార్హం. భారత జట్టు పాకిస్థాన్ కు రాకపోవడానికి ఇదే కారణమని కూడా అన్నారు. పండితులకు పాకిస్తాన్ లోకి ప్రవేశం ఉండదు.. కాబట్టి దుబాయ్ లో భారత్ అలా చేయడం సులభం అంటూ వాదించారు. ఇది మాత్రమే కాకుండా.. ఏడుగురు పండితులు ముందుగానే స్టేడియానికి చేరుకుంటాడని ఆ ఆరుగురిలో మరో వ్యక్తి పేర్కొన్నాడు. వారు మంత్రవిద్యలు అభ్యసించడం ప్రారంభిస్తారని చెప్పాడు.ఓ టీవీ ఛానెల్ ఇలా చేతబడి గురించి మాట్లాడడం గమనార్హం.

Pakistan TV Channels Blame Superstitions for Loss Claim India Used 22 Experts for Victory

ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన భారత్, పాక్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్టేడియంలో కూర్చుని ప్రార్థనలు చేస్తూ కనిపించాడు. రిజ్వాన్ ప్రార్థనలు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై అప్పటికే కామెంట్రీ బాక్స్ లో ఉన్న వహాబ్ రియాజ్, ఆకాశ్ చోప్రా, సురేష్ రైనాలు చర్చించుకున్నారు. సురేష్ రైనా సరదాగా కామెంట్ చేస్తూ.. రోహిత్ శర్మ కూడా మహామృత్యుంజయ మంత్రం జపించేవాడు అని సరదాగా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, February 24, 2025, 15:22 [IST]
Other articles published on Feb 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+